
చిట్వేలి, (జనస్వరం) : చిట్వేలి పట్టణంలో స్థానిక సమస్యలపై బుధవారం జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోమశిల వెనుక జలాలు చిట్వేలికి వస్తున్నాయి, చిట్వేలి నుండి కోడూరు ప్రధాన రహదారి పనులు మొదలవుతున్నాయి వంటి వాగ్దానాలు కేవలం ప్రకటనలకు పరిమితం అయ్యాయి అని, కార్యరూపం దాల్చటం లేదని దుయ్యబట్టారు. అగ్రికల్చర్ హబ్ గా ఉన్న చిట్వేలిలో రైతులు పండించిన పంటల కోసం కోల్డ్ స్టోరేజ్ లు నిర్మించాలని కోరారు. అలాగే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాస్తున్న విద్యార్థి, విద్యార్థినులు కరెంట్ కోతల వలన ఇబ్బంది పడుతున్నారు అని, ప్రభుత్వం ముందు చూపు లేకపోవడమే విద్యుత్తు కోతలకు కారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మాదాసు శివ, పురం సురేష్, కంచర్ల సుధీర్ రెడ్డి, కడుమురి సుబ్రమణ్యం, మురళి కృష్ణ, హరి ప్రసాద్, భరత్, లోకేష్, జనసేన పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.