Logo
Date of Publish : 18 December 2020, 5:57 am
Editor : Sake Naresh

ప్రాణాలు కోల్పోయిన జనసైనికుడు కుటుంబానికి అండగా జనసేన పార్టీ నాయకులు

ప్రాణాలు కోల్పోయిన జనసైనికుడు కుటుంబానికి అండగా జనసేన పార్టీ నాయకులు

        విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంనకు చెందినటువంటి జనసేన పార్టీ నాయకుడు V. రమణ మూర్తి ( జానీ ) అంతిమయాత్రకు జనసేన పార్టీ రాష్ట్ర నాయకుడు అయినటువంటి శ్రీ తమ్మిరెడ్డి శివశంకర గారు ( రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ) మరియు శ్రీ బొలిశెట్టి సత్య గారు ( పర్యావరణ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ) శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారు ( రాష్ట్ర అధికార ప్రతినిధి ) శ్రీ వన్నెం రెడ్డి సతీష్ కుమార్ గారు ( jsp Dalam కన్వీనర్ ) విచ్చేసి నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి నాలుగు మండలాల జన సైనికులకు, జనసేన నాయకులకు, మెగా ఫ్యామిలీ అభిమానులకు ఒక సందేశం ఇచ్చారు. అదేమిటంటే క్లిష్ట పరిస్థితుల్లో అయినా మీ వెంట జనసేన పార్టీ ఉంటుంది అని తెలియ చెప్పేందుకే మేం వేరే పనుల్లో ఉన్నా సరే సమాచారం అందిన వెంటనే నర్సీపట్నం చేరుకోవడం జరిగిందని అన్నారు.  మీరెవరూ సహనాన్ని కోల్పోవద్దని ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా జన సైనికులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించడానికి మేము అందరం రావడం జరిగిందని ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకర విషయం అయినప్పటికీ జనసైనికుడు కుటుంబానికి మనమందరం ఉన్నాం అనే భరోసా కల్పించాలని నర్సీపట్నం విచ్చేసిన రాష్ట్ర నాయకులు అన్నారు. తదుపరి జానీ కుటుంబ సభ్యులను పరామర్శించి మేమందరం ఉన్నాము అని భరోసానిచ్చారు. ధైర్యంగా ఉండండి మీ వెంట జనసేన పార్టీ ఉంది ఎప్పుడు అధైర్యపడవద్దు అని సంబోధించారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం నియోజకవర్గం నాయకులు రాజన వీర సూర్య చంద్ర, చక్రవర్తి, కొప్పాక కళ్యాణ్, శ్రీనివాసరావు, మారిశెట్టి రాజా, ద్వారపూడి జగదీష్, గుడివాడ కృష్ణ, గూడెపు తాతబాబు, అల్లు నరేష్, P.నాగు, బాలేపల్లి కృష్ణారావు, అద్దేపల్లి గణేష్, P. హరినాథ్, సూరవరపు శ్రీను, లంక వీర పాత్రుడు, పి పోతురాజు, నాలుగు మండలాల జనసైనికులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com