క్రిష్ణగిరి, (జనస్వరం) : క్రిష్ణగిరి మండలంలో ప్రధాన సమస్యలు అర్హులైన ప్రతి ఒక్క పేదవారికి ఇల్లు పట్టాలు శాంక్షన్ చేయాలి. శాంక్షన్ చేసిన ఇల్లు పట్టాలు కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా ఇవ్వాలి. అలాగే క్రిష్ణగిరి మండలంలో ఉన్న గ్రామాలలో భూమి వ్యవహారాలు అవకతవకలు జరుగుతున్నాయని, వాటన్నిటిపై ఎంక్వయిరీ చేసి ఎవరైతే లబ్ధిదారున్నారో వారికి సక్రమంగా పని చేసి పెట్టాలని అన్నారు. క్రిష్ణగిరి మండలంలో కొందరు వీఆర్వోల తప్పిదనం వల్ల సమస్యలు నెలకొంటున్నాయని, అలాంటి సమస్యను వెంటనే పరిష్కరించాలని జనసేన పార్టీ తరఫున కోరుచున్నాము. మరి ముఖ్యంగా ఆగవెళ్లి గ్రామంలో వైయస్సార్ కాలనీలో అర్హులైన వారికి పట్టాలు శాంక్షన్ అయినప్పటికీ, ఇంతవరకు పట్టాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. శాంక్షన్ అయిన ఇల్లు పట్టాలు వైఎస్ఆర్సిపి నాయకుడి దగ్గర ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వారి దగ్గర మీరు ఏ విధంగా వారికి ఇస్తారు ప్రజలు అంటే అంత చులకన అయిపోయిందా మీకు ఇల్లుకు సంబంధించిన పట్టాలు రెవెన్యూ ఆఫీసర్ అయిన ఎమ్మార్వో దగ్గరైన వీఆర్వో దగ్గరైన ఆర్ ఐ దగ్గర ఉండాలి. మీరు ఆయనకు ఏ విధంగా ఇచ్చారని ప్రశ్నించారు. అలాగే సోమవారం లోపల ప్రతి ఒక్కరికి ఇల్లు పట్టాలు ఇవ్వాలని, ఇవ్వని ఎడల జనసేనపార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు తెలియజేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, నాయికల్ బాబ్జి, కాల్వ భాస్కర్, పులి శేఖర్, మదన గోపాల్, శ్రీరాములు, వడ్డే వీరేష్, శీను, కురువ సుధాకర్, ప్రసాద్, మోదిన్, తదితరులు పాల్గొన్నారు.