Logo
Date of Publish : 10 August 2021, 2:27 pm
Editor : Sake Naresh

జనసేన పార్టీ కువైట్ నాయకులు సేవలు అభినందనీయం: నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖర్

     గూడూరు, (జనస్వరం) :  జనసేన పార్టీ కోసం జనసేన కువైట్ నాయకులు చేస్తున్న సేవలు అభినందనీయమని నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ రావు గారు అన్నారు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని జనసేన పార్టీ కువైట్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న 30 రోజులు 30 సేవా కార్యక్రమాల్లో భాగంగా గూడూరులోని ఓం సాయి చారిటీస్ లోని అనాధలకు, వృద్ధులకు కడవకూటి పెంచలయ్య దాతృత్వంతో చీరలు, పంచెలు, దుప్పట్లుతో పాటుగా కేక్ కట్ చేసి పండ్లు అందచేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న తీగల చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ కుటుంబ పోషణ కోసం కువైట్ లో ఉంటూ జనసేన పార్టీ పటిష్ఠత కోసం అన్ని విధాలుగా సహకరిస్తున్న జనసేన పార్టీ కువైట్ సభ్యులకు, మరియు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన గంగారపు చంద్రశేఖర్, యర్రంశెట్టి హరిబాబు రాయల్ కు కృతజ్ఞతలు తెలిపారు. జనసేన కార్యకర్తలు క్షేత్రస్థాయిలో జనసేన సిద్ధాంతాలను తీసుకెళ్లి 2024లో పవన్ ను సీఎం చేయడమే ధ్యేయంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా జనసేన కార్యదర్శి అల్లం బాబు, సంయుక్త కార్యదర్శి లీలామోహన్ గారు మాట్లాడుతూ ఇతర దేశంలో ఉంటూ జనసేన కోసం పని చేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం చిన్నా జనసేన మాట్లాడుతూ తనపై నమ్మకంతో కార్యక్రమాల నిర్వాహక బాధ్యతను అప్పచెప్పిన జనసేన కువైట్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మోహన్, ఉదయ్, మణి, ఓంకార్, చెంగయ్య, కోటి తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com