Logo
Date of Publish : 17 August 2021, 5:46 am
Editor : Sake Naresh

పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ మాసోత్సవాల సందర్భంగా జనసేనపార్టీ కువైట్ ఆధ్వర్యంలో 13 వరోజు కార్యక్రమం

                 జనసేన పార్టీ కువైట్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు మాసోత్సవాల్లో భాగంగా 13 వ కార్యక్రమం జనసేన పార్టీ కువైట్ సభ్యులు తోట గంగయ్య గారి ఆర్థిక సహకారంతో కడపజిల్లా కమలాపురం నియోజకవర్గం చింతకొమ్మదిన్నె మండలం కొప్పర్తి గ్రామంలో గ్యాస్ సిలెండర్ లు లేని సుమారు 20 నిరుపేద కుటుంబాలకు గ్యాస్ సిలిండర్ తో కలిపిన పొయ్యిలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమమునకు ముఖ్య అథిదిగా కమలాపురం జనసేన నాయకులు ఇందిరెడ్డి వేణుగోపాల్ పాల్గొని వారి చేతుల మీదుగా నిరుపేదలకు అందించడం జరిగింది. వేణుగోపాల్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ మనకు స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరములు అవుతున్నప్పటికీ కూడ గ్యాస్ లేక కట్టెల పోయి మీద వంట చేసుకోవడం భాధాకరం. మా జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి గ్యాస్ ఉచితంగా ఇస్తామని పవన్ కళ్యాణ్ గారు మ్యానిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. దురదృష్టవశాత్తు మేము రాకపోవడం జరిగింది. మా అధినేత ఆశయాలకు అణుగుణంగా జనసేనపార్టీ కువైట్ సభ్యుల సహకారంతో నిరుపేదలకు ఈ గ్యాస్ సిలెండర్ లు పంపిణీ చేయడం సంతోషంగా వుందన్నారు. ఈ కార్యక్రమమునకు సహకరించిన జనసేన పార్టీ కువైట్ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమమునకు షరీఫ్, రాంసిద్దూ, విశ్వనాధ్, దాదాపీర్, అర్జున్ రాయల్, శ్రీను, శ్రీకాంత్, హరి, నరేష్ పాల్గొనడం జరిగింది. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com