ఎచ్ఛర్లలో విద్యార్థులుకు N95 మాస్కులు పంపిణీ చేసిన జనసేన పార్టీ, జీల్ ఫౌండేషన్
కరోనా వ్యాధి వ్యాప్తి సమయంలో క్లాసులుకు హాజరువుతున్న ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఉన్న GHS స్కూల్, పోలీస్ క్వాటర్స్, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎచ్చెర్ల, ZPHS స్కూల్, అల్లినగరం ZPHS స్కూల్, మురపకాలో ఉన్న విద్యార్థులకు, ఉపాధ్యాయులుకు ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన పార్టీ నాయకురాలు సయ్యద్ కాంతి శ్రీ, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు డా.సయ్యద్ విశ్వక్షేన్ మరియు జీల్ ఫౌండేషన్ కో ఆర్డినేటర్ సత్యసాయి N95 మాస్క్ లు మరియు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంతిశ్రీ మాట్లాడుతూ కరోనా వ్యాధి నివారణకు ప్రభుత్వం ఇస్తున్న కాటన్ మాస్కులు వ్యాధి నిరోధకతకు ఉపయోగపడవనీ అందువల్ల మేము జీల్ ఫౌండేషన్, జనసేన పార్టీ ఆధ్వర్యంలో 500 మంది విద్యార్థులుకు N95 మాస్కులు పంపిణీ చేసామని, ఇవి విద్యార్థులు ఆరోగ్య రక్షణకు ఉపయోగపడే విధంగా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జీల్ ఫౌండేషన్ జిల్లా కో ఆర్డినేటర్ సత్యసాయి మాట్లాడుతూ భావి భారత దేశాన్ని ముందుకు తీసుకు వెళ్లేది విద్యార్థులే అటువంటి విద్యార్థులు ఆరోగ్యం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చూపడం బాధకరంనీ విద్యార్థులు ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని ఈ రోజు విద్యార్థులు, ఉపాధ్యాయులు కు మాస్కులు పంపిణీ చేసామనీ భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు మా జీల్ ఫౌండేషన్ ద్వారా చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు డా. సయ్యద్ విశ్వక్షేన్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కాకర్ల. బాబాజీ, బార్నల.దుర్గారావు, రాజా రమేష్, లక్ష్మునాయడు, అప్పలకొండ, సుర్య, జయప్రకాశ్, తిరు, మనోజ్, సాయి జీల్ ఫౌండేషన్ సభ్యులు సాయి, శేఖర్, ప్రియాంక, కుసుమ, యశ్వంత్, వినోద్, కార్తీక్ మరియు ఎచ్చెర్ల నియోజకవర్గ జన సైనికులు తదితరులు పాల్గొన్నారు.