విజయనగరం జిల్లా శృంవరపుకోట నియోజకవర్గం దేశ పాత్రునిపాలెం గ్రామంలో గొరపెల్లీ కొండమ్మ గారి పాకను బలవంతంగా అధికార పార్టీ నేతలు నేల కూల్చడం, జీవనోపాధి కోల్పోవడం అధికారులు ఆ కుటుంబానికి న్యాయం చేయలేకపోయారు. ఆ తల్లి ఊరు బాగు కోసం త్యాగం చేసినా అధికార పార్టీ నేతలు నిలువ నీడ లేకుండా చేసి అన్యాయం చేశారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులు శ్రీ బొలిశెట్టి సత్యనారాయణ గారు, శ్రీ వన్నెం సతీష్ కుమార్ గారు, తదితర జనసైనికులు ఆ గ్రామాన్ని సందర్శించారు. జనసైనికులు అందరూ అండగా నిలిచి న్యాయ స్థానంలో కేసు వేసి పోరాటం చేస్తున్నవారిని అభినందించారు. గోరపెల్లి కొండమ్మ మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులకు ఎన్నో సార్లు మా సమస్యను విన్నవించుకున్నా ఫలితం లేదన్నారు. గ్రామసభలో కూడా మాకు తగిన సహాయం చేయలేదన్నారు. మా ఇళ్లను కూల్చడం బాధాకరం అని అన్నారు. శ్రీ బొలిశెట్టి సత్యనారాయణ గారు మాట్లాడుతూ గ్రామం అంతా ఏకతాటిపై ఉండడం చాలా సంతోషం వేసిందని అన్నారు. స్వాతంత్రంను బ్రిటిష్ వాళ్ళు ఇచ్చే ముందు భారతీయులతో మీరు దేశాన్ని ఎలా పరిపాలించుకోగలరు? మీకు అంత శక్తి ఉందా అని ప్రశ్నించగా ఆరోజు మన నాయకులు మా దేశంలో ప్రతి గ్రామం ఒక స్వతంత్ర ప్రతిపత్తి అని అన్నారు. ఆ మాటను ఈరోజు మీ గ్రామం ఆ విలువలను పాటిస్తోందని అన్నారు. గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుందని అన్నారు. జనసేన పార్టీ తరుపున మీకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గొరపల్లి రవి, రాజా బాబు, కొత్తవలస శ్రీనివాస్, సతీష్, జనసైనికులు, వీర మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.