
రామగుండం, (జనస్వరం) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణికి వస్తున్న తెలంగాణ రాష్ట్ర జనసేన నాయకులకు రామగుండం నియోజకవర్గ నాయకులు రావుల సాయి క్రిష్ణ మరియు రావుల మధు ఆధ్వర్యంలో రాష్ట్ర ఇంఛార్జ్ నేమురి శంకర్ గౌడ్, రాష్ట్ర నాయకులు రామ్ తల్లూరి, అర్హం ఖాన్, ఆకుల సుమన్, వంగ లక్ష్మణ్ గౌడ్, మిరియాలా రామకృష్ణ, గోకుల రవీందర్ రెడ్డి, నందగిరి సతీష్, మహిళా విభాగం నాయకులు లిఖిత గారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం గోదావరిఖని మున్సిపల్ వద్ద గల అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో జనసేన పార్టీ రాష్ట్ర యువత సెక్రెటరీ మూల హరీష్ గౌడ్, గొట్టే మధుకర్, విశ్వఙ చారీ, వడ్డేపల్లి రాకేష్, మంథని శ్రవణ్, మహమ్మద్ ఇమ్రాన్, రవికాంత్, ఎమూర్ల రంజిత్, బండారి తిరుపతి, పొట్ల శశాంక్, పెగడపల్లి ప్రకాష్ మరియు జనసైనికులు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.