Logo
Date of Publish : 03 March 2022, 4:55 am
Editor : Sake Naresh

కార్యకర్తలకు అండగా ఉండే ఏకైక పార్టీ జనసేన పార్టీనే : జనసేనపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి

      విజయనగరం, (జనస్వరం) : జనసేన పార్టీ మాత్రమే కార్యకర్తలకు పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి, పీఏసీ సభ్యులు శ్రీ పాలవలస యశస్వి పేర్కొన్నారు. అందుకే క్రియాశీలక కార్యకర్తలకు ఐదు లక్షల రూపాయలు ప్రమాద బీమా అందిస్తున్నట్టు వివరించారు. కొత్తవలస జంక్షన్ లో మంగళవారం పార్టీ నాయకులు శ్రీ గొరపల్లి రవికుమార్, శ్రీ గొరపల్లి చినబాబు ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. పార్టీ కార్యకర్తలకు ఐదు లక్షల రూపాయలు విలువ చేసే ప్రమాద బీమాతో కూడిన క్రియాశీలక సభ్యత్వాన్ని నమోదు చేశారు. ఈ సందర్భంగా యశస్విని మాట్లాడుతూ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీ కనుకే ఇక్కడ అందరినీ జనసైనికులుగా సంబోధిస్తామని పేర్కొన్నారు. త్వరలో క్రియాశీలక జనసైనికులందరికీ సభ్యత్వం పూర్తి చేస్తామన్నారు. నియోజకవర్గ నాయకులు శ్రీ వబ్బిన సత్తిబాబు, శ్రీ వబ్బిన సన్యాసినాయుడు, శ్రీ సేనాపతి కొండలరావు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి చర్యలు చేపడుతున్నట్టు వివరించారు. జనసైనికులంతా కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వేపాడ జెడ్పీటీసీ అభ్యర్థి సుంకరి అప్పారావు, పార్టీ పార్లమెంటరీ కమిటీ సభ్యులు మల్లువలస శ్రీను, జొన్నపల్లి సత్తిబాబు, కొత్తవలస మేజర్ పంచాయతీ వార్డు మెంబర్ గాలి అప్పారావు, కొత్తవలస ఎంపీటీసీ అభ్యర్థి నక్కరాజు సతీష్, నియోజకవర్గ నాయకులు పెదిరెడ్ల రాజశేఖర్, నాయకులు గురజాడ వెంకటేష్, శ్రీనివాస రాజు, లింగాల హరీష్, పెంటకోట శ్రీను, గుమ్మడి వెంకటరావు,  బొడ్డు రాంబాబు, ముచ్చకర్ల శ్రీను, ఇరోతి బాబూరావు, ఇరోతి శివాజీ, ఉగ్గిన నాగరాజు, తూరిబిల్లి రాము, ఇల్లపు సంతోష్, జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com