Logo
Date of Publish : 03 May 2022, 4:14 pm
Editor : Sake Naresh

మీరు పెట్టే పోలీస్ కేసులకు జనసేన పార్టీ భయపడదు : రవి కుమార్ మిడతాన

     విజయనగరం ( జనస్వరం ) : విజయనగర జనసేన నాయకులు రవి కుమార్ మిడతాన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు మా జనసేన అధినేతపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఎందుకు కేసులు పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెట్టి భయభ్రాంతులు గురి చేస్తే జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు. మీ ఓటమి త్వరలోనే చూస్తారు, ఆ భయంతో ఇలా కేసులు పెట్టి జనసేన పార్టీ నాయకులు మీద పోలీస్ కేసులు పెడితే సహించమని, మా జనసేన పార్టీ నాయకులు, దళిత నాయకుడు  మోహన్ రావు ప్రభుత్వ తప్పుడు విధానాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా ప్రజలకు తెలియజేస్తున్నారన్నారు.  ఇలా మీరు చేసే తప్పులను ప్రశ్నిస్తే కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తే జనసేన పార్టీ భయపడదన్నారు. మోహన్ రావు గారికి జనసైనికులు అందరూ తోడుగా ఉంటారన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే, ప్రజా ప్రతినిధులు గజపతినగరం నియోజకవర్గంలో కేసులు పెట్టి భయపడే ప్రసక్తే లేదని,, ఇకనైనా ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు ప్రజలు ఎన్నుకోబడ్డ ప్రభుత్వం, మీరు మంచి చేస్తే అభినందిస్తున్నామన్నారు. ఇకనైనా ఈ ప్రభుత్వం తప్పుడు విధానాల్ని మార్చుకోవాలి తప్ప భయపెట్టి రాజకీయాలు చేయకూడదని ప్రజలు అన్నీ గమనిస్తున్నారని మీకు తగిన బుద్ధి చెప్తారన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com