తిరుపతిలో బలపడుతున్న జనసేన పార్ట
- జనసేనలో చేరిన బంజారా జనసంఘ్ నాయకులు
- పార్టీ కండువా కప్పుకున్న రాష్ట్ర అధ్యక్షులు, కార్యదర్శి, జిల్లా అధ్యక్షులు
- కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్
తిరుపతి ( జనస్వరం ) : తిరుపతిలో జనసేన పార్టీ బలపడుతోంది. వివిధ సంఘాల నాయకులు పార్టీలో చేరుతున్నారు. బుధవారం బంజారా జనసంఘ్ నాయకులు పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఆధ్వర్యంలో పార్టీ కండువాలు కప్పుకున్నారు. బంజారా జనసంఘ్ రాష్ట్ర అధ్యక్షులు మూడే వెంకటేష్ నాయక్, రాష్ట్ర కార్యదర్శి మూడే చంద్రశేఖర్ నాయక్, జిల్లా అధ్యక్షులు మూడే విజయ్ కుమార్ నాయక్ లతో పాటు పలువురు నాయకులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ జనసేనాని సిద్దాంతాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారన్నారు. తిరుపతి నియోజకవర్గంతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జనసేన పార్టీ క్షేత్ర స్ధాయిలో బలపడుతోందన్నారు. తిరుపతిలో జనసేన, టిడిపి బలపరిచిన అభ్యర్ధిని గెలిపించుకుంటామన్నారు. తిరుపతి సీటు గెలిచి పవన్ కళ్యాణ్ కు గిఫ్ట్ గా ఇస్తామని తెలిపారు. పార్టీని సంస్ధాగతంగా బలంగా తయారు చేశామని ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అందరూ సిద్దంగా ఉన్నామన్నారు. పార్టీలో నూతనంగా చేరే వారికి ఆహ్వానం పలుకుతున్నామన్నారు. తిరుపతిలో జనసేన. టిడిపి ఉమ్మడి అభ్యర్ధి గెలుపు ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బత్తిన మధుబాబు, రాష్ట్ర కార్యదర్శి అకేపాటి సుభాషిణి, రాయలసీమ మహిళా కరో్డినేటర్ ఆకుల వనజ, జిల్లా కార్యదర్శి ఆనంద్, బాబ్జి, బాటసారి, తిరుపతి నగర అధ్యక్షులు రాజారెడ్డి, ఉపాధ్యక్షులు పార్ధు, లక్ష్మి, నగర ప్రధాన కార్యదర్శి దినేష్ జైన్, రుద్ర కిషోర్ , రాజేష్ ఆచారి, నగర కార్యదర్సులు, చరణ్ రాయల్, కిరణ్ కుమార్, లోకేష్, బాలాజీ, హేమత్, పురుషోత్తం, సాయికుమార్, మనోజ్ కుమార్, గౌస్ బాషా, సీనియర్ నాయకులు చందు, వంశీ, తిరుపతి అర్బన్ అధ్యక్షులు జనసేన సాయి, జనసైనికులు రవి, మోహిత్, ఇంద్ర, బాలాజీ, వీరామహిళలు దుర్గ, వరలక్ష్మి, తదితర నాయకులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com