– ఇందులో ప్రజలకు ప్రత్యేక ఆహ్వానం
– రాజకీయాల్లో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి
– అప్పుడే జవాబుదారీతనం, పారదర్శకత ఉంటుంది
– పవన్ కళ్యాణ్ కాబోయే ముఖ్యమంత్రి
– జనసేన ఇంచార్జి Dr యుగంధర్ పొన్న
కార్వేటినగరం, (జనస్వరం) : కార్వేటి నగరం మండల కేంద్రంలో గంగాధర నెల్లూరు నియోజకవర్గం జనసేన పార్టీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమం లో నియోజకవర్గం ఇంచార్జి Dr యుగంధర్ పొన్న ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా Dr యుగంధర్ పొన్న మాట్లాడుతూ నియమ నిష్ఠలు లేని రాజకీయ నడుమలో జనసేన పార్టీ ఒక దేవాలయమని, జనసేన పార్టీ రోజురోజుకి దిన దినాభివృద్ధి చెందుతోందని, దీనిని అడ్డుకోవడం ఎవరితరం కాదని ఉద్భోదించారు. ఇందులో ప్రజలకు ప్రేత్యేక ఆహ్వానం ఉంటుందని, జనసేన ప్రజలకు పల్లకి మోయడానికి వచ్చిందని, అంతిమ అధికారం ప్రజల చేతుల్లో పెట్టడం ఖాయమని తెలిపారు. రాజకీయాల్లో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరియని, అందుకే ప్రతీ ఒక్కరూ పవన్ కళ్యాణ్ సేవలకు గాను పది రూపాయల నుండి ఎంతైనా 7288040505, 7288049595@upi నెంబర్ కి ఫోన్ పే, గూగుల్ పే, పేటియం ద్వారా పంపాలని, తద్వారా ప్రజలకు భాగస్వామ్యం పెరుగుతుందని తెలిపారు. అప్పుడే జవాబుదారీతనం, పారదర్శకత ఉంటుందని తెలియజేసారు. నియోజకవర్గంలో జనసేన విజయకేతనం ఎగురవేస్తుందని, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవడం ఖాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్వేటి నగరం మండల పార్టీ అధ్యక్షులు శోభన్ బాబు, గంగాధర నెల్లూరు మండలం అధ్యక్షులు సురేష్ రెడ్డి, ఎస్ ఆర్ పురం మండల అధ్యక్షులు చిరంజీవి, పాలసముద్రం మండల అధ్యక్షులు లతీష్ కుమార్, వెదురు కుప్పం మండల ప్రధాన కార్యదర్శి రాజు, పెనుమూరు మండల ఉపాధ్యక్షులు ప్రసాద్, ఉపాధ్యక్షులు విజయ్, సురేష్ రెడ్డి, వెంకటేష్, ప్రధాన కార్యదర్శులు నరేష్, చంద్రమౌళి, దేవేంద్ర, రంజిత్, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, నగర కమిటి అధ్యక్షులు రాజేష్, కార్యదర్శులు ప్రతాప్, సూర్య నరసింహులు, జిల్లా కార్యనిర్వహణ కమిటి సభ్యులు బాను చంద్ర రెడ్డి, నాయకులు అరవింద్, రోహిత్, అజిత్ కుమార్, గిరిబాబు, వెంకట ముని, రాజు, యాండ్రు పాల్గొన్నారు.