కువైట్ ( జనస్వరం ) : కడప బైపాస్ రోడ్డులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రాజేష్ తీవ్ర గాయాల పాలైనారు. ఏలూరు హాస్పిటల్ లో కోమా స్థితిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం కువైట్ లో ఉన్న జనసైనికులకు తెలిసింది. వారు మానవత్వంతో సహకరించి రాజేష్ చికిత్స నిమిత్తం ఆర్థికసాయంగా 80,000 రూ. రాజేష్ అన్న యానకి సాయికి అందజేశారు. జనసేనపార్టీ కువైట్ అధ్యక్షులు యర్రంశెట్టి హరిబాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు అనుసరిస్తున్న సేవా భావాన్ని మేము అలవరుచుకున్నామని అన్నారు. ఎవరికి ఏం కష్టం వచ్చినా కువైట్ జనసైనికులు అండగా ఉంటారని తెలిపారు. సహృద మానవత్వంతో స్పందించే విధానాన్ని పవన్ కళ్యాణ్ గారు మాకు నేర్పారని, మేము పాటిస్తున్నామని తెలిపారు. ఆర్థిక సాయానికి సహకరించిన సభ్యులు ముద్దపోలు రమణ, బాల్లేపల్లీ శ్రీను, గంటా రమేష్ రాయల్, యర్రంశెట్టి హరిబాబు రాయల్, నిలకంఠరాయల్, గ్రందే ప్రసాద్ రాయల్, మాచర్ల. సురేష్, గంగారపు చంద్రశేఖర్ చింతం, మురళి, సిరిశెట్టి. మల్లికార్జునరాయల్, కుంచా శంకర్, అక్కిశెట్టి రెడయ్య, శెట్టిపల్లి ప్రసాద్, రవి, పృద్విరాజు(నాని), మోడెం చిరంజీవి, వెంకీరాయల్, శివ, ఎం.శివ, మహేష్ నాయుడు, శేఖర్, అశోక్ రాజు, శివబంగారం, జోగరావు లకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మెరుగైన వైద్యాన్ని అందించాలని కోరారు.