Logo
Date of Publish : 03 June 2022, 12:10 pm
Editor : Sake Naresh

నిరాశ్రయులైన పేద కుటుంబానికి అండగా జనసేన పార్టీ

● బాధిత కుటుంబానికి పరామర్శ
● రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్

      కొండపల్లి, (జనస్వరం) : ఈదురు గాలి ప్రభావానికి నిరాశ్రయులైన పేద కుటుంబానికి జనసేన పార్టీ నేతలు అండగా నిలిచారు. కొండపల్లి పట్టణ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో ఇటీవల వీచిన ఈదురు గాలికి ఇంటిపైన రేకులు పూర్తిగా విరిగిపోయాయి. దీంతో ఆ కుటుంబం నిరాశ్రయులైంది. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నాయకులు శుక్రవారం ఇందిరమ్మ కాలనీ వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బొలియశెట్టి శ్రీకాంత్ తన వంతు రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజలు కష్టాల్లో ఉంటే ఆదుకునేది జనసేన పార్టీ మాత్రమేనన్నారు. బాధిత కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు వై.నాగేశ్వరరావు, పులిపాక ప్రకాష్, బత్తిన శ్రీనివాసరావు, చెన్నం శెట్టి కోటేశ్వరరావు, రామంజి, సురేష్, జగదీష్, రమేష్, వీర మహిళలు బొలియశెట్టి విజయ దుర్గ, హేమలత, రాణి, జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com