నిర్మల్, (జనస్వరం) : నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయం ముందర విఆర్ఎ లు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్నారు. వీరికి జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సుంకెట మహేష్ బాబు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో గ్రామ రెవెన్యూ సహాయకులు దాదాపు ఇరవై మూడు వేల మంది వున్నారు. ప్రభుత్వ రెవెన్యూ వ్యవస్థలో కింది స్థాయి ఉద్యోగులుగా వుంటూ సమగ్ర కుటుంబ సర్వే నుండి నేటి దళిత బందు వరకు అనేక ప్రభుత్వ సర్వేలు, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకుపోవడంలో వి ఆర్ ఏ లు ప్రధాన భూమిక పోషిస్తున్నారు. గతంలో అనేక రూపాల్లో శాంతియుతంగా పోరాటాలు చేసిన పట్టించుకోలేదు కాబట్టి సమ్మె చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటించిన ప్రకారం పేస్కెల్, వారసులకు ఉద్యోగాలు, అర్హత కలిగిన వారికి ప్రమోషన్స్, తదితర డిమాండ్లను వెంటనే అమలు చేయాలని జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. లేని యెడల ప్రభుత్వం దిగివచ్చే విధంగా అన్ని మండల, జిల్లా కేంద్రాల్లో పోరాటాలు చేస్తూ వారికి అండగా నిలుస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com