Logo
Date of Publish : 14 February 2022, 5:09 pm
Editor : Sake Naresh

భూమి కోసం ధర్నా చేస్తున్న దళితులకు మద్దతుగా జనసేన పార్టీ

     భైంసా, (జనస్వరం) :  గత 11 రోజులుగా భూమి సాగు కోసం భైంసా మండల మహగం గ్రామ దళితులు చేస్తున్న ధర్నాకు జనసేన పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు సుంకెట మహేష్ బాబు మద్దతు పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళితులకు మూడు ఎకరాల భూమినీ ఇస్తానని చెప్పి కొందరూ అనర్హులకు, రాజకీయ అండతో భూమిని ఇచ్చి మిగితా దళిత కుటుంబాలకు అన్యాయం చేశారు. కాబట్టి వాళ్ళు ప్రభుత్వ భూమి 218 గల సర్వేలో సాగుచేస్తామని వెళ్తే అడ్డుకుంటున్నారు. సాగు చేయాలనే భూమిలో ఇప్పటికే కొందరు ప్రభుత్వాన్ని మోసం చేసి పట్టాలు చేసుకున్నారు. ఆ భూమిపై కొందరి దళారుల కన్నుపడి అన్యాక్రాంతం అవుతుంది. దాన్ని కాపాడాలని, ఎన్నో సంవత్సరాలుగ ఒక్క గుంట భూమి లేక ఇక్కడే నివసిస్తున్న వీరికి మాత్రం భూమి ఇవ్వడంలేదు. కొన్ని సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరిగిన ఎవరు పట్టించుకోలేదు. కాబట్టి ప్రభుత్వ భూమిలో దున్నుకొని పంట సాగుచేసుకోవడానికి అన్ని అర్హతలు వున్న వీరికి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. వీరి పోరాటానికి దళిత సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు మద్దతుగా వుండాలని కోరుతూ ఆందోళన తీవ్ర స్థాయిలోకి వెళ్ళక ముందే సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సాహెబ్ రావ్, గ్రామ దళితులు ఆనంద్, గంగాధర్, భీం రావ్, శంకర్, బాబు, కమల, లక్ష్మి, పంచపుల తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com