భైంసా, (జనస్వరం) : గత 11 రోజులుగా భూమి సాగు కోసం భైంసా మండల మహగం గ్రామ దళితులు చేస్తున్న ధర్నాకు జనసేన పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు సుంకెట మహేష్ బాబు మద్దతు పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళితులకు మూడు ఎకరాల భూమినీ ఇస్తానని చెప్పి కొందరూ అనర్హులకు, రాజకీయ అండతో భూమిని ఇచ్చి మిగితా దళిత కుటుంబాలకు అన్యాయం చేశారు. కాబట్టి వాళ్ళు ప్రభుత్వ భూమి 218 గల సర్వేలో సాగుచేస్తామని వెళ్తే అడ్డుకుంటున్నారు. సాగు చేయాలనే భూమిలో ఇప్పటికే కొందరు ప్రభుత్వాన్ని మోసం చేసి పట్టాలు చేసుకున్నారు. ఆ భూమిపై కొందరి దళారుల కన్నుపడి అన్యాక్రాంతం అవుతుంది. దాన్ని కాపాడాలని, ఎన్నో సంవత్సరాలుగ ఒక్క గుంట భూమి లేక ఇక్కడే నివసిస్తున్న వీరికి మాత్రం భూమి ఇవ్వడంలేదు. కొన్ని సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరిగిన ఎవరు పట్టించుకోలేదు. కాబట్టి ప్రభుత్వ భూమిలో దున్నుకొని పంట సాగుచేసుకోవడానికి అన్ని అర్హతలు వున్న వీరికి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. వీరి పోరాటానికి దళిత సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు మద్దతుగా వుండాలని కోరుతూ ఆందోళన తీవ్ర స్థాయిలోకి వెళ్ళక ముందే సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సాహెబ్ రావ్, గ్రామ దళితులు ఆనంద్, గంగాధర్, భీం రావ్, శంకర్, బాబు, కమల, లక్ష్మి, పంచపుల తదితరులు పాల్గొన్నారు.