సత్తుపల్లి ( జనస్వరం ) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర కమిటీ తెలంగాణలో 32 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా సత్తుపల్లి నియోజకవర్గ ఇన్చార్జి బండి నరేష్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో సత్తుపల్లి నియోజకవర్గం నుండి జనసేన పార్టీ ఖచ్చితంగా పోటీ చేస్తుందని తెలియజేయడం జరిగింది. సత్తుపల్లిలో జనసేన పార్టీకి ఉన్నటువంటి బలం అదేవిధంగా సామాజిక మరియు భౌగోళిక పరిస్థితులు దృష్ట్యా గత సంవత్సరం నుండి కంటిన్యూషన్ గా నడుస్తున్నటువంటి పార్టీ కార్యక్రమాలు మరియు ఉద్యమాల పురిటి గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ ప్రెసిడెంట్ బండి నరేష్ గారిని ఇక్కడ ఇన్చార్జ్ గా నియమించడం పార్టీకి బలంగా కలిసి వస్తుందని చెప్పుకొచ్చారు. ఎన్నికల పోటీ చేసే అభ్యర్థి విషయంలో మాట్లాడుతూ ఎవరైతే ముందు నుండి పార్టీ కోసం కష్టపడి ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారో వారిని అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని తెలియజేయడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com