
ఆమదాలవలస, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం బూర్జ మండలం వావం పంచాయతీ ఉవ్వపేట గ్రామంలో నిన్న మధ్యాహ్నం వెంకటప్ప గణేష్, శ్యామ్ సుందర్ సాహు రైతులకు సంబంధించి సుమారు 3 ఎకరాల చెరుకు తోట, అర ఎకరం నిమ్మ తోటలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ విషయం తెలుసుకున్న ఆమదాలవలస నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావు కార్యకర్తలతో కలిసి చెరుకు, నిమ్మ తోటలను పరిశీలించి స్థానిక తహసీల్దార్ గారికి తెలియపరిచి, ఆయా రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బూర్జ ఎంపీటీసీ విక్రమ్, జైరాం, సంగం నాయడు, మన్మధ, ఆసిరినాయుడు, ఢిల్లేశ్వరరావు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.