Logo
Date of Publish : 31 July 2022, 12:52 pm
Editor : Sake Naresh

గిరిజన ప్రాంతాల్లో పల్లె పల్లెకు – గూడ గూడకు జనసేన పార్టీ సిద్ధాంతాలు

     పాలకొండ, (జనస్వరం) : పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం మండలం, ములలంక, గాదెలలంక, పెద్దూరు గిరిజన గ్రామాల్లో ఈరోజు జనసేనపార్టీ నాయకులు పర్యటించారు. గిరిసేన - జనసేన కార్యక్రమంలో భాగంగా మత్స. పుండరీకం మాట్లాడుతూ సంవత్సరానికి ఐదు నుండి ఎనిమిది గ్యాస్ సిలిండర్ల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. తెల్లరేషన్ కార్డుదారులకు ఇల్లు కట్టుకోవడానికి ఇసుక ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. వ్యవసాయం చేసిన రైతులకు ఐదు వేల రూపాయలు పెన్షన్ సౌకర్యం జనసేన పార్టీ కల్పిస్తుంది అన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్  ప్రజల పక్షాన నిలబడిన నాయకుడు. అలాంటి నాయకుడుని ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది అని మత్స.పుండరీకం పిలుపునిచ్చారు. మేము ప్రతి ఇంటి ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరిని కలిసి ముఖ్యంగా మహిళలకు అర్ధమైన రీతిలో జనసేన పార్టీ మేనిఫెస్టో వివరించడం జరిగింది. గత నాలుగు వారాలుగా గిరిజన ప్రజల దగ్గరకి వెళ్లి పలు కుటుంబాలను కలిసి జనసేన పార్టీ సిద్ధాతాలు గురించి వివరంగా చెప్పడం జరిగింది. గిరిసేన - జనసేన కార్యక్రమం ద్వారా ప్రజలునుండి అపూర్వమైన స్పందన లభిస్తోందన్నారు. గిరిజన ప్రాంతాల్లోని ప్రజలు గత ఎన్నికల సందర్భంగా ఒక్క ఛాన్స్ జగన్ కి ఇచ్చాం అని ఓటేసిన పాపానికి నిత్యవసర ధరలు ఆకాశాన్ని అంటాయని, రేషన్ బియ్యం మాత్రం ఇస్తున్నారు ఇంకేమి ఇవ్వడం లేదని, గిరిజన ప్రాంతాల్లో పండించే పంటలకు గిట్టుబాటు ధరలు లేవని అలాగే స్థానికంగా పనులు లేక సుదూర ప్రాంతలకు వలసలు వెళ్లిపోతున్నము అని గిరిజన మహిళలు జనసైనికులకు చెప్పారు. వీటికి మత్స.పుండరీకం సమాధానం ఇస్తూ జనసేన పార్టీ మేనిఫెస్టో లో గిరిజన ప్రాంతాల్లో ని ఆహార పంటలు కు, గిరిజన ఉత్పతులు తయారు చేసేoదుకు స్థానికంగా ఉంటూ ఉద్యోగ, ఉపాధి కల్పన కల్పిస్తుంది అని అన్నారు. రాబోయే ఎన్నికల్లో గాజుగ్లాస్ గుర్తుకి మీ అమూల్యమైన ఓటును వేసి జనసేన పార్టీ గెలిపించాలని గిరిజన మహిళలను కోరారు. గిరిసేన - జనసేన కార్యక్రమంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు కర్నేన సాయి పవన్, కోడి వెంకటరావు నాయుడు, బి.పి.నాయుడు, అన్ను రామకృష్ణ, వావిలిపల్లి నాగభూషణ, దండేల సతీష్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com