గుంటూరు జిల్లా మాచర్ల మండలం నాగులవరం పంచాయతీ బోదనంపాడు గ్రామం లో ఏడు నెలల పసిపాప సుధారాణి పై గుర్తు తెలియని వ్యక్తి అఘాయిత్యం చేయడాన్ని జనసేన పార్టీ వీర మహిళలు తీవ్రంగా ఖండిస్తున్నారు. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ నందు 108 వార్డులో ఉన్న సుధారాణిని పరామర్శించి, ఆమె తల్లిని వివరాలు అడగగా పాపను రాత్రివేళ గుర్తుతెలియని వ్యక్తులు అపహరించి ఆమెపై అఘాత్యము చేసినారని, ఆమె తల్లి తేలియజేసినారు. పాప శరీరంపై గాయాలను గుర్తించి 108 వార్డులో ప్రస్తుతం చికిత్స చేయుచున్నారు. ఈవిషయం తెలుసుకున్న జనసేన పార్టీ 47 డివిజన్ , 16 వ డివిజన్ కార్పొరేటర్లు మరియు వీర మహిళలు పాపను పరామర్శించినారు. దోషులను వెంటనే అరెస్ట్ చేసి పాప కుటుంబాన్ని ఆదుకోవాలని జనసేన కార్పొరేటర్లు ఎర్రంశెట్టి పద్మావతి, దాసరి లక్ష్మి దుర్గాలు డిమాండ్ చేసినారు. వీర మహిళా నాయకురాలు కొల్లా పద్మావతి మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళలపై జరుగుతున్న ఇటువంటి సంఘటనలను రూపుమాపడానికి దిశ చట్టం తీసుకోని వచ్చినా కూడా మహిళలపై అఘాయిత్యాలు జరగటం మానడం లేదని ఆవేదన వ్యక్తం వ్యక్తం చేసినారు. జనసేన వీర మహిళలు కటకంశెట్టివిజయలక్ష్మి ,జగనంమల్లేశ్వరి, ఆశ ,కవిత , తదితర వీర మహిళలు తదితురులు కలిసి పాపను పరామర్శించినారు.