వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి నివాళులు అర్పించిన జనసేన పార్టీ వీర మహిళలు
ఈరోజు వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి గారి 192 వ జయంతి సందర్భంగా జనసేన పార్టీ వీర మహిళా విభాగం తరపున ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వీర మహిళ సుంకర కృష్ణవేణి గారు, పెద్దాపురం నియోజకవర్గ నాయకులు అత్తిలి సీతారామ స్వామి గారు, జనసైనికులు బుచ్చిరాజు మల్లిరెడ్డి వీర మహిళలు, పెనుమండ్ర లీలాకుమారి, శిరీష గారు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం జనసేన వీర మహిళా విభాగం ఝాన్సీ లక్ష్మీబాయి గారి స్ఫూర్తితో ఏర్పాటు చేయడం జరిగింది. కావున అదే స్ఫూర్తితో అంతే పోరాటంతో ఎంతో ధైర్యంగా ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనే విధంగా జనసేన పార్టీ వీర మహిళలు సమాజంలో మహిళా సాధికారత సాధించడం కోసం బలమైన పోరాటాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తూ ఘన నివాళులు అర్పించడం జరిగింది.