శింగనమల ( అనంతపురం ) : నార్పలమండలం, కేశేపల్లి గ్రామనికి చెందిన క్రియాశీలక జనసైనికుడు నీలూరి నారాయణస్వామి ఆరు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. నార్పల మండల, జిల్లా నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నీలూరి నారాయణస్వామి భార్య జయంతితో పాటు కుటుంబ సభ్యులకు పార్టీ తరపున 5 లక్షల రూపాయల చెక్కును జిల్లా అధ్యక్షుడు టిసి వరుణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి గార్ల చేతులమీదుగా అందచేయడం జరిగింది. టి సి వరుణ్ మాట్లాడుతూ అధినేత పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల సంక్షేమం కోసం క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. జనసేనపార్టీ క్రియాశీలక సభ్యత్వం ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చేసుకోవాలని జనసైనికులకు సూచించారు. నీలూరి నారాయణస్వామి భార్య జయంతి మాట్లాడుతూ కుటుంబ పెద్ద మరణించడంతో ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్న మమల్ని గుర్తుపెట్టుకొని మరీ మాకు ఇంత పెద్ద సహాయాన్నిఅందించడానికి కృషిచేసిన పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అలాగే జనసేనపార్టీకి జిల్లా నాయకులకు మండల నాయకులకు జీవితాంతం రుణపడి ఉంటానని కన్నీటిపర్యంతమైయ్యారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మీ కుటుంబానికి అండగా ఉంటారని, జిల్లా నాయకులు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ ప్రాంతీయ వీర మహిళా పసుపులేటి పద్మావతి, కార్యక్రమాల నిర్వహణ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భవాని రవికుమార్, నార్పల మండల కన్వీనర్ గంజికుంట రామకృష్ణ, జిల్లా కమిటీ సభ్యులు ఆరు మండలాల అధ్యక్షులు, నార్పల మండల ముఖ్య నాయకులు తుపాకుల భాస్కర్, విశ్వనాధ్ రెడ్డి, నారాయణ స్వామి, వీరమహిళా తేజలక్ష్మి, కుళ్లాయప్ప, పృద్వి, గిరీష్, రామయ్య, పవన్ కళ్యాణ్, లోకేష్, మహేష్, అశ్వర్థ రెడ్డి, రాజు, భాను, జనసైనికులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com