Logo
Date of Publish : 27 November 2021, 1:31 pm
Editor : Sake Naresh

వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటపొలాలను పరిశీలించిన జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు శ్రీ గాదె వెంకటేశ్వరరావు

     బాపట్ల, (జనస్వరం) : బాపట్ల నియోజకవర్గంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను, పొలాలను పరిశీలించి నష్టపోయిన రైతులను జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు శ్రీ గాదె వెంకటేశ్వరరావు గారు పరామర్శించారు. ఈ సందర్భంగా శ్రీ గాదె వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతూ రైతు కష్టపడి పండించిన పంట ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోతుంటే ఈ ప్రభుత్వము పట్టించుకోవడంలేదని, ఇంతవరకు ప్రభుత్వ అధికారులు గాని, ప్రజా ప్రతినిధులు గాని పంటపొలాలను పరిశీలించడం గానీ, నష్టపోయిన రైతులను ఓదార్చడం గానీ, వారికి తగిన సహాయం అందించడం గాని జరగలేదని, ఈ ప్రభుత్వానికి పబ్లిసిటీ మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదని, రైతు భరోసా కేంద్రాలు పేరుకే కానీ అవి ఏ విధంగానూ రైతులకు ఉపయోగకరంగా లేవని, ముఖ్యమంత్రి వైయస్ జగన్ రెడ్డి గారు వ్యవసాయ రంగాన్ని ఆదుకోవటంలో పూర్తిగా విఫలమయ్యారని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి జరిగిన పంట నష్టానికి అంచనావేసి ఎకరానికి 30 వేల రూపాయలు నష్ట పరిహారం చెల్లించి, రైతులను ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని నాణ్యతతో సంబంధం లేకుండా మద్దతు ధరకే కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి నామన వెంకట శివన్నారాయణ, జిల్లా కార్యదర్శి నక్కల వంశీకృష్ణ, గుంటూరు పట్టణ నాయకులు బాలు శిఖా, కొండూరు కిషోర్, సురేంద్ర, బాపట్ల జనసేన పార్టీ నాయకులు ఇమ్మడిశెట్టి మురళి కృష్ణ, గొగన ఆదిశేషు,ఆరమల్ల సుజిత్, కొట్ర మణికంఠ, బడే అంకమ్మరావు, కర్లపాలెం మండలం జనసేన పార్టీ నాయకులు మడసాని బాలాజీ, S.రాంబాబు, T.సింగారావు, M. శ్రీనివాస రావు, I. శ్రీనివాస రావు, I. చౌదరి,G. వెంకట రామారావు, తాండ్ర రాధాకృష్ణ మరియు రైతులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com