Logo
Date of Publish : 15 April 2022, 7:26 am
Editor : Sake Naresh

ఆలూరు నియోజకవర్గములో గడప గడపకు జనసేన పార్టీ

    ఆలూరు, (జనస్వరం) : కర్నూలు జిల్లా, ఆలూరు నియోజకవర్గం దేవనకొండ మండలం పీ. కోటకొండ, దుప్పనగుర్తి గ్రామాల్లో ఆలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ తెర్నెకల్ వెంకప్ప జనసైనికులతో కలిసి పర్యటించారు. అక్కడున్న ప్రజలతో మమేకమై వైసీపీ వైఫల్యాలు కుడి చేత్తో ఇచ్చి, ఎడమ చేత్తో తీసుకోవడం. నిత్యావసర సరుకుల పైన, విద్యుత్తు, చెత్త పనులు, ధరలు కనీసం 10-20% అదనపుగా (పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే) ఇలా వైసీపీ వైఫల్యాలు చర్చిస్తూ, 2024 జనసేనకి పట్టం కట్టాలని కోరారు. జనసేన షణ్ముఖ వ్యూహాలు(ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తు కోసం) ప్రజలకు వివరించారు. అలాగే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతుల ఆత్మహత్యలు ( రాష్ట్రంలోనే అత్యధికంగా కర్నూలు జిల్లాలో 353 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు) చేసుకున్న వారికీ అండగా ఉండేందుకు రూ. 5 కోట్ల రూపాయలు కేటాయించి జనసేన పార్టీ తరఫున ప్రతి కుటుంబాన్ని పరామర్శించి త్వరలోనే అందజేస్తారు. జనసేన పార్టీ ఎల్లప్పుడు ప్రజలకు అండగా ఉంటుంది. అధికారం వచ్చిన తర్వాత చేస్తామని కల్లబొల్లి కబుర్లు చెప్పమని వివరించారు. ఈ కార్యక్రమంలో దేవనకొండ జనసేన నాయకులు మగ్బుల్, బడేసా, ఆంథోని, నందు, వీరేష్, ఖళీల్ పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com