Logo
Date of Publish : 12 September 2021, 4:10 pm
Editor : Sake Naresh

పార్వతీపురం నియోజకవర్గములో అంగరంగవైభవంగా జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం

      పార్వతీపురం, (జనస్వరం) : పార్వతీపురం నియోజకవర్గం బలిజిపేట మండలం, మిర్తివలస గ్రామంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి శ్రీ బాబు పాలూరు గారి అధ్యక్షతన అంగరంగ వైభవంగా జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముందుగా మిర్తివలస గ్రామం మొత్తం జనసైనికులతో ఊరేగింపుగా కవాతు జరిపి అనంతరం శ్రీ బాబు పాలూరు గారి చేతుల మీదుగా జెండా వందనం కార్యక్రమం జరిగింది. తదుపరి వివిధ నియోజకవర్గాల జనసేన నాయకులు మాట్లాడారు, అనంతరం శ్రీ బాబు పాలూరు గారు మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న అసమతుల్యత పాలన చూసి విసిగిపోయి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టారు. ఆయన స్పూర్తితో మేము అంతా ఆయన వెంట నడుస్తున్నాము. ఆయనని నమ్మి ఈరోజు కొన్ని లక్షల మంది యువత పోరాటం చేయడానికి ముందుకు వస్తున్నారు. అలాగే ఆయనకు అండగా ఉండడానికి వస్తున్నారు. యువత రాజకీయంలోకి రావాలి అని, యువత రేపటి భవిష్యత్తు అని యువత కోసం ఆయన అండగా నిల్చున్నారు అని అన్నారు. ముందు నా సొంత గ్రామం, నేను పుట్టిన గ్రామం అయిన మిర్తివలస నుండే మార్పు మొదలు అవ్వాలని అప్పుడే మండలం ఆ తర్వాత జిల్లా మొత్తం మార్పు మొదలు అవుతుందని తెలియజేసారు. 2024 లో జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని, ఒక్క పిలుపుతో వర్షాన్ని సైతం లెక్క చెయ్యకుండా విచ్చేసిన ప్రతి ఒక్క జనసైనికుడికి, అలాగే ప్రతి ఒక్క నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం నియోజకవర్గం నాయకులు, బొబ్బిలి నియోజకవర్గం నాయకులు, కురుపాం నియోజకవర్గం నాయకులు మరియు జనసైనికులు  తదితురులు భారీగా పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com