Logo
Date of Publish : 02 April 2022, 3:02 pm
Editor : Sake Naresh

ఉగాది సందర్భంగా నర్సీపట్నంలో జనసేనపార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం

      నర్సీపట్నం, (జనస్వరం) : జనసేన పార్టీ నర్సీపట్నం మున్సిపాలిటీలో గల టౌన్ 8వ వార్డు నందు నర్సీపట్నం నియోజకవర్గ సమన్వయకర్త రాజనా వీర సూర్య చంద్ర ముఖ్య అతిథిగా 9వ వార్డ్ కౌన్సిలర్ శ్రీమతి అద్దేపల్లి సౌజన్య సమక్షంలో నర్సీపట్నం టౌన్ నాయకులు కొత్తకోట రామ శేఖర్, ఎనిమిదో వార్డ్ టీం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో ఉగాది సందర్భంగా సూర్య చంద్ర మాట్లాడుతూ మన సంప్రదాయం ప్రకారం ఉగాది రోజున భవిష్యత్ కాలంలో బాగుండేలాగా కార్యక్రమం ప్రారంభిస్తాం అదే కోవలో 2024 సంవత్సరంలో జనసేన జెండా ఎగిరే విధంగా మా నర్సీపట్నం నియోజకవర్గంలో టౌన్ లో ఉన్నటువంటి అన్ని వార్డులలో కూడా జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఎనిమిదో వార్డు నుంచి ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఇప్పటికే తొమ్మిదో వార్డ్ లో విజయం సాధించి మున్సిపాలిటీలో జనసేన గళం వినిపిస్తున్నమని రాబోయే రోజులలో 28 వార్డ్ లో కూడా జనసేన జెండా ఎగిరే విధంగా ప్రయత్నం ప్రారంభించామని తెలియజేశారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి కొత్తకోట రామ శేఖర్ మాట్లాడుతూ గడిచిన ఎన్నికలలో అతి స్వల్ప తేడాతో పరాజయం పాలైన 8వ వార్డు వచ్చే ఎన్నికలలో విజయం సాధించి తీరుతాం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం టౌన్ అధ్యక్షుడు అద్దేపల్లి గణేష్, నర్సీపట్నం రూరల్ అధ్యక్షుడు ఊడి చక్రవర్తి, ప్రగాఢ ప్రవీణ్, దేశెట్టి సూర్య భూమి, విజయ్, వాసు, పెనుపోతుల నాగు, గూడెపు తాతబాబు, బైన మురళి, అల్లు నరేష్, నాతవరం మండల అధ్యక్షుడు దొర బాబు, దేశెట్టి వెంకటేష్, పవన్, హర్ష, శ్రీకాంత్, ఉగ్గిన గణేష్, సంతోష్, లక్ష్మణ్, నరసింగ్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com