
నెల్లూరు ( జనస్వరం ) : ఆత్మకూరు నియోజకవర్గంలోని మర్రిపాడు మండలం, ఇసుక పల్లి గ్రామంలో డబ్బుకొట్టు నాగరాజు యాదవ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రజల సమస్యలపై పోరాటంలో జనసేన పార్టీ ముందుంటుందని, జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు ప్రతి జనసైనికుడు అలుపెరగని పోరాటంచేయాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మర్రిపాడు మండల కేంద్రం నుండి ఇసుక పల్లి గ్రామం వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ నలిశెట్టి శ్రీధర్ మరియు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి, ఉయ్యాల ప్రవీణ్, శేఖర్ రెడ్డి, దాడి అజయ్, బొబ్బేపల్లి సురేష్, శ్రీపతి రాము, శిరీష రెడ్డి, ఇందిరా రెడ్డి, ఆలియా, ఆత్మకూరు నియోజకవర్గ జనసైనికులు మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు.