ఈరోజు వేలేరుపాడు అంబేద్కర్ సెంటర్లో గణేశులు మరియు ఆదినారాయణ అధ్యక్షతన అఖిల పక్షం ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల హక్కుల సాధన కోసం మానవహారం నిర్వహించడము జరిగింది. కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ సీపీఐ, సీపీఎం, జనసేన, బీజేపీ పార్టీల నేతలు, వ్యాపార వర్గాల వారు, రైతులు, పుర జనులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నిర్వాసితుల హక్కులు సాధించే వరకూ పోరాటం కొనసాగుతుంది అని, నిర్వాసితులకు రావలసిన అన్ని రకాల నష్ట పరిహారాలు ఇచ్చి, పునరావాసంలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించి తరలించాలని, తరలించే నాటికి 18సం. లు నిండిన యువతీ యువకులను పరిగణన లోకి తీసుకొని వ్యక్తి గత ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2,3 రోజుల్లో స్థానిక ఎమ్మెల్యే బాలరాజు గారిని కలవాలని, పునరావాస కేంద్రాలను (కాలనీలు) పరిశీలించాలని, పోలవరం ప్రాజెక్టును సందర్శించి పరిస్థితి అంచనా వేయాలని అఖిల పక్షం సమావేశం లో తీర్మానించడం జరిగింది. ఆ తరువాత అంచెలంచెలుగా అధికారులను, ప్రజా ప్రతినిధి లను కలవాలని, మధ్య మధ్యలో నిర్వాసిత గ్రామాలు పర్యటన చేయాలని తీర్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో md మునీర్, సాయిబాబా, సత్తిపండు, దారయ్య, దర్ముల రమేష్, పురుషోత్తం, బుడిపిటి సురేష్, సమ్మయ్య, కట్టే ఉదయ్, జాను బాబు, పొట్ల మోహన్ దొర, క్రాంతి, సఫీ, బలరామ్, ఆటో పుల్లయ్య, బాబా గారు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com