Logo
Date of Publish : 03 March 2022, 5:04 pm
Editor : Sake Naresh

మర్రిపాడులో పల్లె పల్లెకు జనసేన పార్టీ విస్తరణ

               నెల్లూరు ( జనస్వరం ) : మర్రిపాడు మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాబోయే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పల్లె పల్లెకు జనసేన సిమెంటు బల్లలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మర్రిపాడు మండల జనసేన పార్టీ అధ్యక్షురాలు ప్రమీలా గారి చేతుల మీదుగా రెండు జనసేన పార్టీ సిమెంటు బెంచ్ లు ప్రారంభించడం జరిగింది. పడమటి నాయుడుపల్లి గ్రామంలో గంటా అంజి అధ్యక్షతన చుంచులూరు గ్రామంలో చీలపోగు అశోక్ కుమార్ అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ప్రమీల మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్దాంతాలను, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు చిన్నా జనసేన, జిల్లా సంయుక్త కార్యదర్శి వనం పవన్, మండల ఉపాధ్యక్షుడు ఉదయ్ రామిరెడ్డి, ప్రశాంత్ కుమార్ రెడ్డి, పెంచలరావు, శిల్పం మనోజ్, ప్రకాష్ బగాది, గంగయ్య, ఈరుపోతు మణికంట, కుంటా ప్రసాద్ జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com