
వీరఘట్టం, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా, పాలకొండ నియోజకవర్గ పరిధి వీరఘట్టం మండలం, నడుకూరు గ్రామంలో జనసేన పార్టీ తొమ్మిదవ( 9వ) ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా నడుకూరులో ఉన్న ఆంజనేయ స్వామి మందిరంలో పవన్ కళ్యాణ్ గారి పేరిట మరియు అమరావతిలో ఈ రోజు జరిగే జనసేన మహా సభ విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ చేసి కేకు కట్ చేశారు. ఈ కార్యక్రమంలో నడుకూరు గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకుడు మత్స.పుండరీకం మాట్లాడుతూ బాధ్యతల నుండి నాయకుడు పుడతాడని అటువంటి బాధ్యత గల నాయకుడు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారేనని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును దిశానిర్దేశం చేయనున్నారు. భావితరాలకు భవిష్యత్తు భరోసా కల్పించేది ఒక్క పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కి మాత్రమే ఉందని అన్నారు. అలాగే పాలకొండ జనసేన పార్టీ నాయుకులు పొరెడ్డి ప్రశాంత్ పోట్నురు రమేష్ లు మాట్లాడుతూ ప్రతి జనసైనికుడు గ్రామ స్థాయిలో జనసేన పార్టీ అభివృద్ధి కృషి పార్టీ యొక్క సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో కోడి వెంకటరావునాయుడు, మక్క బాబ్జి, కంటు గణేష్, మంతిని వేగ్రీస్, వాన మహేష్, మాచర్ల చందు కంబరవలస, కిమ్మి, విక్రమపురం, చలివేoద్రి, వీరఘట్టం గ్రామ జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.