Logo
Date of Publish : 16 March 2022, 1:58 am
Editor : Sake Naresh

పెందుర్తి నియోజకవర్గంలో ఘనంగా జనసేనపార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

     పెందుర్తి, (జనస్వరం) : పెందుర్తి నియోజకవర్గం నరవ గ్రామంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నాయకులు శ్రీ వబ్బిన జనార్ధన శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ శ్రీ వసంత లక్ష్మి, వీరమహిళ పార్వతి, జిల్లా నాయకులు గోపికృష్ణ గారి చేతుల మీదగా జండా ఆవిష్కరణ, కేక్ కటింగ్ తో పాటు అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో పేదవాళ్లకు నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో వసంత లక్ష్మి మాట్లాడుతూ రేపు జరగబోతున్న అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి చలో అమరావతి ఇప్పటం గ్రామానికి అందరూ తరలి వెళ్లాలని, అక్కడికి వెళ్లలేని ప్రజలు టీవీలో స్పీచ్ ఆలకించి రాష్ట్ర భవిష్యత్తు ప్రణాళిక వైపు అడుగులు వేయాలని, నరవ గ్రామంలో జండా ఆవిష్కరణ నన్ను భాగస్వామిని చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ జనసైనికులు అందరూ ఐకమత్యంగా అధ్యక్షులు వారినీ ముఖ్యమంత్రి చేసేవరకు శ్రమించాలని కోరడం జరిగింది. శ్రీకాంత్ మాట్లాడుతూ నియోజవర్గం సమన్వయకర్త శ్రీ తమ్మీరెడ్డి శివశంకర్ గారి సూచన మేరకు గ్రామంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, నియోజకవర్గంలో మండలాలకు చలో అమరావతి ఇప్పటం గ్రామం సభకు బస్సులు వేయడం జరిగిందని, ప్రభుత్వం జనసేన పార్టీ సభకు ఎన్ని ఇబ్బందులు కలిగించిన ప్రజలు జనసేన వైపు నిలబడ్డారు అని, ప్రజలు జనసేన వైపు చూస్తున్నారని, మనమందరం ప్రజల సమస్యల వైపు నిలబడాలని పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో T శ్రీనివాస్, శేఖర్, లక్కీ గోవింద్, జుత్తాడ శ్రీనివాస్, అప్పు, రవిబాబు గవర శీను, బొడ్డు నాయుడు, ప్రవీన్, చిన్న ,అశోక్, నవీన్, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com