● భవిష్యత్తు తరాలకు భరోసా జనసేన పార్టీ
● ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
● జనసేన పార్టీ పాలకుర్తి నియోజకవర్గ నాయకులు మేడిద ప్రశాంత్
పాలకుర్తి, (జనస్వరం) : రాజకీయ వ్యవస్థలో నూతన విధానానికి శ్రీకారం జనసేన పార్టీతోనే సాధ్యమని జనసేన పార్టీ పాలకుర్తి నియోజకవర్గ నాయకులు మేడిద ప్రశాంత్ అన్నారు. భవిష్యత్తు తరాలకు భరోసానిస్తూ, సామాన్యులను రాజకీయంగా ప్రోత్సహిస్తూ, సమసమాజ స్థాపనకై జనసేన పార్టీ పనిచేస్తుందని తెలిపారు. పార్టీ తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా పాలకుర్తి కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో పార్టీ జెండా ఆవిష్కరణ చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పార్టీ రాష్ట్ర నాయకులు గాదె పృథ్వి, అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసారు. విలేకర్లతో మాట్లాడుతూ జనసేన పార్టీలో యువతకు అవకాశం కలిపించి అధినేత పవన్ కళ్యాణ్ యువతకు మార్గదర్శిగా నిలిచారని తెలిపారు. జీరో బడ్జెట్ విధానంతో రాజకీయ ప్రక్షాళనకు కృషి చేస్తున్నారని తెలిపారు. ఎనిమిది ఏళ్లలోనే పార్టీ ప్రగతి సాధించిందని పేర్కొన్నారు. నేడు ప్రతి గడపకు జనసేన అండగా ఉందని తెలిపారు. రాబోయే రోజుల్లో ఊరురా జనసేన జెండా ఎగురుతుందని ఆశాభావం వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో బండి శివ, సైదులు, పూజారి సాయి, మారోజు సాయి, టపా కిరణ్ తదితరులు పాల్గొన్నారు