ఒంగోలు ( జనస్వరం ) : జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ గారి ఆధ్వర్యంలో ఒంగోలు నుండి పెద్దఎత్తున బస్ లు, కార్ ల లో వేలాది మంది జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు మంగళగిరి లోని ఇప్పటంలో జరగనున్న బహిరంగ సభకు తరలి వెళ్ళడం జరిగింది. మరియు రియాజ్ ఆదేశాలు మేరకు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒంగోలులోని జనసేన పార్టీ కార్యాలయంలో ఒంగోలు నగర అధ్యక్షులు మలగా రమేష్ పార్టీ జెండా ఎగరవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు చనపతి రాంబాబు, రాయని రమేష్, బొందిల శ్రీదేవి, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి అరుణ రాయపాటి, ఒంగోలు నగర జనసేన పార్టీ ఉపాధ్యక్షులు పిల్లి రాజేష్,ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులు బొర్ర వాసు, పల్ల ప్రమీల, మరియు ఒంగోలు నగర జనసేన పార్టీ కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com