రాయవరం, (జనస్వరం) : తూర్పు గోదావరి జిల్లా, మండపేట నియోజకవర్గం, రాయవరం మండలం, చెల్లూరు గ్రామంలో జనసేన పార్టీ 8 సంవత్సరాలు పూర్తి చేసుకుని 9వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా చెల్లూరు జనసైనికులు ఆధ్వర్యంలో ఘనంగా జనసేనపార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. చెల్లూరు గ్రామ 1వ వార్డ్ సభ్యులు శ్రీమతి గళ్ళా సావిత్రి, MPTC -1 సభ్యులు శ్రీమతి గొల్లపల్లి అనురాధ కేక్ కట్ చేసి ప్రజలకు మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో చెల్లూరు, సూర్యారావు పేట, కృష్ణమ్మ చెరువు జనసైనికులు, నాయకులు, వీరమహిళలు, అభిమానులు, పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com