ఒంగోలు ( జనస్వరం ) : పెర్నమిట్ట లోని హరిప్రియ కన్వెన్షన్ హాల్ లో సంతనూతలపాడు నియోజకవర్గ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ సామాన్యులు ఇబ్బంది పడుతూ రోడ్లు వెయ్యండి అంటే రోడ్లు వెయ్యలేని ప్రభుత్వం ఎయిర్పోర్ట్ లు కడతాను అనటం ఎంతవరకు సాధ్యమో ఆలోచించుకోవాలన్నారు. పరిశ్రమలు ఆహ్వానించి ఉపాధి కల్పించలేని ముఖ్యమంత్రి పల్లెకారుల జీవనధారం కూడా లాగేసుకొని వారికీ తీవ్ర అన్యాయం చేస్తున్నాడని ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే ప్రజలే బుద్ది చెప్తారు అని తెలియచేసారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ప్రజలు అందరూ బాధితులుగా రోడ్ ల పైనే వున్నారు అని, ఎప్పుడు ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకొని ఏ వర్గం ప్రజల్ని పీడిస్తారో తెలియక బయపడుతున్నారు. అని పెద్ద కొడుకుగా వుంటాను అని చెప్పిన ముఖ్యమంత్రి ధరలు, పన్నులు పెంచి ఆస్థి లాగేసుకుంటున్నాడు అని ఏద్దేవా చేసారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెదపూడి విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత వైసీపీ పాలనలో ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి, మంత్రులు MLA లు కాకుండా అడ్డదారిలో అధికారం ఛేజిక్కించుకున్న సజ్జల రామక్రిష్ణ రెడ్డి పరిపాలిస్తున్నాడన్నారు. దేశంలో మరియు రాష్ట్రంలో గతంలో ఏ ముఖ్యమంత్రికి లేని అంతమంది సలహాదారులుని నియమించుకొని కూడా ఇలాంటి నిరాశజనక పాలన జగన్ కొనసాగిస్తున్నాడని విమర్శించారు. ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ మాట్లాడుతూ రాష్ట్రములో అరాచక పాలన నడుస్తుందన్నారు. ఇలాంటి అరాచకాల్ని అరికట్టాలి అంటే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని స్వాగతించాలని అప్పుల్లో కూరుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ ని కాపడటం కేవలం కళ్యాణ్ గారితోనే సాధ్యమన్నారు. రాష్ట్రములో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని రక్షణ వ్యవస్థ వైసీపీ పార్టీకి కొమ్ముకాస్తుంది అని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రకాశం జిల్లా సీనియర్ నాయకులు కందుకూరు బాబు మాట్లాడుతూ సంతనూతలపాడు నియోజకవర్గంలో జనసేన పార్టీని బలోపేతం చెయ్యాలి అని అధికార పక్షం దాడులు ధీటుగా ఎదుర్కోవాలి అని కొత్తగా నియమించిన నాయకులు పార్టీ కోసం నిరంతరం శ్రమించి 2024 లో జనసేన అధికారమే లక్ష్యంగా పని చెయ్యాలని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్, ఒంగోలు నగర జనసేన పార్టీ అధ్యక్షులు మలగా రమేష్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు చనపతి రాంబాబు, కళ్యాణ్ ముత్యాల, రాయని రమేష్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శులు పెంట్యాల కోటి, అరుణ రాయపాటి, చీమకుర్తి మండల అధ్యక్షులు శివ ప్రసాద్, నాగులుప్పలపాడు మండల అధ్యక్షులు భూపతి మురళి, మద్దిపాడు మండల జనసేన నాయకులు బాల సుబ్రహ్మణ్యం, తదితర జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com