
ఆత్మకూరు, (జనస్వరం) : జనసేనపార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వారోత్సవాల సందర్భంగా వారం రోజుల పాటు రోజుకు ఒక ప్రజా సమస్యలపై ఆత్మకూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమంలో భాగంగా, నాలుగవ రోజు నిర్మాణంలో ఉన్న సంగం బ్యారేజీ సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ గారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ వివేక్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ బ్యారేజ్ వివరాలలోకి వస్తే, నెల్లూరు జిల్లాలో పెరిగిన తాగు సాగు నీటి అవసరాల దృష్ట్యా నైతేనేమి, ప్రతి సంవత్సరం వృధాగా పోతున్న సుమారు 40 టీఎంసీల నీటిని వడిసి పట్టె కార్యక్రమంలో భాగంగా నైతేనేమి, ఈ బ్యారేజీ నిర్మాణానికి పుష్కర కాలం క్రితం శంకుస్థాపన చేయడం జరిగింది. 1885 సంవత్సరంలో అప్పటి బ్రిటిష్ పాలనలో, సాంకేతిక యాంత్రిక పరిజ్ఞానము సరిగా లేని రోజుల్లోనే కేవలం నాలుగు సంవత్సరాల కాలంలోనే ఈ ఆనకట్టను పూర్తి చేయడం జరిగింది. శాస్త్ర, సాంకేతిక యాంత్రిక పరిజ్ఞానం పుష్కలంగా ఉన్న నేటి రోజుల్లో పుష్కర కాలం క్రితం శంకుస్థాపన చేయబడిన ఈ బ్యారేజీ నేటికీ నత్తనడకన సాగుతుండటం ఎంతో విచారకరం అని అన్నారు. ఇప్పటికైనా ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. 1885 సంవత్సరం నుండి నేటి వరకు ఈ ఆనకట్ట ద్వారా కేవలం నెల్లూరు జిల్లా తూర్పు ప్రాంతానికి సాగు, తాగునీటిని సరఫరా చేస్తూ వచ్చారు. ఇప్పుడు బ్యారేజ్ నిర్మాణం ద్వారా నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. మరియు ఈ బ్యారేజీ ఆత్మకూరు నియోజకవర్గంలో ఉంది. కావున ఆత్మకూరు నియోజకవర్గ మెట్ట ప్రాంత రైతాంగానికి ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించాలని జనసేన పార్టీ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది. లేనిపక్షంలో దశాబ్దాలుగా దగాపడ్డ మెట్ట ప్రాంత రైతాంగ గొంతుపై జనసేన పార్టీ పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసైనికుల తో కలసి ఇంఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ గారు మరియు జిల్లా సంయుక్త కార్యదర్శి పూసల నాగమల్లేశ్వరరావు గారు జనసైనికులు తదితురులు పాల్గొన్నారు.