రాజంపేట నియోజకవర్గంలోని ప్రజలుకు ఏ ఆరోగ్య సమస్యలు వచ్చినా వైద్యం కోసం ఇతర ప్రాంతాలలోని తిరుపతి మరియు చెన్నై, హైదరాబాద్, వేలూరు ఆసుపత్రిలలో చూపించుకోవాలిసిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి వైద్యం పేద మరియు మధ్యతరగతి ప్రజలకి ఖర్చుతో కూడుకున్న పని. వెనకబడిన రాజంపేట ప్రజల అభివృద్ధి కోసం మెడికల్ కాలేజీను ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. మరియు కరోనాని ఎదుర్కోవాలి అంటే తక్షణమే ఆక్సిజన్ ప్లాంట్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అని జనసేన పార్టీ ప్రజల తరపున సబ్ కలెక్టర్ చేతన్ గార్గ్ గారికి న్యాయ సమ్మతమైన వినతిపత్రం జనసేన నాయకులు చెంగారి శివ ప్రసాద్ గారి చేతులు మీదగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన లీగల్ సెల్ నాయకులు కత్తి సుబ్బారాయుడు, శంకర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com