కర్నూలు జిల్లా పత్తికొండలో డిప్యూటీ తహసీల్దార్ గారిని కలిసి జనసేన పార్టీ నియోజకవర్గ నాయకుడు C రాజశేఖర్ ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని అందించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ కేంద్రమైన పత్తికొండ పట్టణంతోపాటు మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో ఇసుక కొరత తీవ్రంగా ఉంది, ఇసుక అందుబాటులో లేకపోవడంతో వందల మంది తాపీ మేస్త్రీలు, మరియు కూలీలు, ఉపాధి లేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు, ఉపాధి లేకపోవడం వల్ల భార్య పిల్లలకు మూడు పూటల తిండి కూడా పెట్టలేని దౌర్భాగ్య స్థితిలో భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటివరకూ పత్తికొండలో డంపు యార్డ్ ఏర్పాటు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ కొంతమంది వైఎస్‌ఆర్‌సిపి పార్టీకి చెందిన కొంతమంది నాయకులు ఇసుక ట్రాక్టర్లను తీసుకువచ్చి అధిక ధరలకు అమ్ముతున్నారని అన్నారు. ఆయా గ్రామాల, పట్టణ, ప్రజలు జనసేన పార్టీ దృష్టికి తీసుకురావడం జరిగింది. వీళ్ళు అధిక ధరలకు ఇసుక అమ్మడం వల్ల ఇల్లు కట్టుకునే సామాన్య, మధ్యతరగతి, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కానీ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం రాష్ట్రంలో ఇసుక కొరత లేకుండా చేస్తామని చెబుతున్నారు. కానీ చర్యలు అమలు కావడం లేదని అన్నారు. కావున తమరు స్పందించి తక్షణమే పత్తికొండ పట్టణంలో ఇసుక డంపింగ్ యార్డును ఏర్పాటు చేసి ఇసుక కొరతను తీర్చి, అధిక ధరలకు ఇసుక అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. భవన నిర్మాణ కార్మికులకు ప్రజలకు న్యాయం చేయగలరని కోరుచున్నామన్నారు. లేనిపక్షంలో భవన నిర్మాణ కార్మికులతో కలిసి జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమములు, ధర్నా చేస్తామని తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు సింగం శ్రీధర్, ఇస్మాయిల్, నూర్బాష, తిమ్మప్ప, అనిల్, మరియు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com