
విశాఖపట్నం పర్యటనలో ఉన్న భారత దేశ ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారిని విశాఖ జిల్లా జనసేన పార్టీ గాజువాక నియోజకవర్గ ఇంచార్జ్ లు కోనతాత రావు గారు, ఎలమంచిలి ఇంఛార్జి సుందరపు విజయ్ కుమార్ గారు, చోడవరం ఇంఛార్జి పీ.వీ. స్.ఎన్ రాజు గారు, భీమిలి ఇంఛార్జి డా. సందీప్ పంచకర్ల గారు, నార్త్ ఇంఛార్జి పసుపులేటి ఉషా కిరణ్ గారు ఈరోజు మర్యాద పూర్వకంగా కలిశారు. వీరు సమావేశంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మరియు విశాఖ జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారికి వివరించారు.