నర్సీపట్నం నియోజకవర్గ సమన్వయకర్త రాజన్న వీర సూర్య చంద్ర సమక్షంలో మాకవరపాలెం మండలం గంగవరం పంచాయితీ సీతాన అగ్రహారం గ్రామం ముఖ్య నాయకులు మంగరాజు రమణ రాజు ఆధ్వర్యంలో టిడిపి మరియు వైసీపీ పార్టీ నుండి 50 మంది జనసేన పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారు తమ గోడు విన్నవించుకున్నారు. మా తాతలు తండ్రులు కాలం నుండి గ్రామ అభివృద్ధి బాటలో ఎప్పుడూ కూడా వివక్ష చూపుతున్నారని పార్టీలు మారిన అధికారం మారిన మా బ్రతుకు ఎప్పుడు ఒకేలా ఉందని అన్నారు. సరైన వీధిలైట్లు లేవని స్మశాన వాటిక లో కనీసం బోరు సౌకర్యం లేదని అంతేకాకుండా మంచినీటి సౌకర్యం కూడా పూర్తి స్థాయిలో లేదని వివరించారు. అంతే కాకుండా డ్రైనేజీ వ్యవస్థ మరింత అధ్వానంగా ఉందని మా ఊరి ప్రజలు ఆవేదన ఇలాంటి సమస్యలపై గళం విప్పుతున్న మా జనసైనికుల వెంట మేం నిలబడాలి అనుకున్నాం అని వివరించారు. అందుకనే ఈ రోజు జనసేన పార్టీలో చేరడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు నర్సీపట్నం గ్రామీణ అధ్యక్షుడు ఊడి చక్రవర్తి నర్సీపట్నం మున్సిపాలిటీ నాయకులు గూడెపు తాతబాబు, నమ్మి కొండలరావు , నమ్మి పోతురాజు, మోటమర్రి శ్రీనివాసు. కొరకాలి అప్పలనాయుడు, చప్ప నానాజీ, నమ్మి మంగ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com