
హైదరాబాద్ ( జనస్వరం ) : జనసేన పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంఛార్జి డాక్టర్ మాధవ రెడ్డి గారి ఆధ్వర్యంలో చందానగర్ డివిజన్ ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో చందానగర్ డివిజన్ అద్యక్షులు బి అరుణ్ కుమార్ గారు పాల్గొని రానున్న రోజుల్లో జనసేన పార్టీ ని డివిజన్ స్థాయిలో అనుసరించ వలసిన వివరాలను తెలియ చేశారు. ఈ ఆత్మీయ సమావేశంలో డివిజన్ జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొని పార్టీ బలోపేతానికి అభిప్రాయలను తెలియచేశారు. అందరి ఆలోచనలను పరిగణలోకి తీసుకుని పార్టీ బలోపేతానికి తగిన చర్యలు తీసుకుంటామని అదే విధంగా మును ముందు జనసేన పార్టీ సిద్ధాంతాలను నియోజవర్గస్థాయిలో ప్రతి గడప గడపకు తీసుకెళ్లే కార్యచరణ రూపొందిస్తున్నట్లు మధవరెడ్డి తెలియచేశారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ వీర మహిళలు, నాయకులు పాల్గొని విజయవంతం చేయటం జరిగింది.