నె ల్లిమర్ల ( జనస్వరం ) : డెంకాడ ప్రజా సంక్షేమం కోసమే జనసేన పార్టీ ఆవిర్భవించిందని పార్టీ అన్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సంధర్బంగా నెర్లిమర్ల నియోజకవర్గం డెంకాడ మండలంలో భారీ బహిరంగ సభవేదిక వద్ద నియోజకవర్గంలో అన్ని మండలం నుండి డెకాండ వద్ద భారీ బహిరంగ సభ వద్ద జిల్లా జనసేన నాయకులు జనసైనికులు వీరమహిళలు నియోజకవర్గం ప్రజలు సమక్షంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జనసేన పార్టీ పదేళ్ల క్రిందట సిద్దాంతాలతో ఆవిర్భవించిందో అదే సిద్దాంతాల కోసం జనసైనికలు , వీర మహిళలు అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ప్రతీ జనసైనికుడు పార్టీకోసం శ్రమిస్తున్నారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించేందుకే జనసేన పార్టీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుందన్నారు. ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో కూటమి విజయం సాధిస్తుందన్నారు. నెల్లిమర్ల నియోజకవర్గం లో జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మీరు నన్ను ఆదరించి నాకు ఒక అవకాశం ఇస్తే నెర్లిమర్ల నియోజకవర్గంని అభివృద్ధిలో దూసుకు పోతుందని తెలిపారు. వైసీపీ ఎన్ని బీరాలు పలికినా, రానున్న ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల కూటమి విజయం సాధించడం ఖాయమన్నారు.ప్రజలను రక్షించడం కోసం మూడు పార్టీల కలయిక అవసరమన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని మొదటి నుంచి చెబుతూ వస్తున్న పవన్ కల్యాణ్ మాటలు నేటికి కార్యరూపం దాల్చుతున్నాయని లోకం మాదవి తెలిపారు…..