రామచంద్రపురం నియోజకవర్గం జనసేనపార్టీ ఇంచార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ గారు, బారతీయ జనతా పార్టీ అమలాపురం పార్లమెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇళ్ళ వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. గ్రామ పంచాయతీ సర్పంచులను గ్రామ ప్రజల సమక్షంలో పంచాయతీ అభివృద్ధికి తోడ్పడే అభ్యర్థులను జనసేన బిజేపి ఇరు పార్టీలు పోటీకి సిద్ధంగా ఉన్నాయని అన్నారు. దానిలో భాగంగా జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో గల ప్రతిగ్రామ మును సందర్శించి ఉమ్మడి అభ్యర్థులును ఎంపిక చేసి ఉమ్మడిగా బరిలో సిద్ధంగా ఉన్నామని ఈ కోణంలోనే రాబోయే స్థానిక ఎన్నికలలో గట్టి పోటీ ఇచ్చి ప్రతి అభ్యర్థిని గెలిపించుకోవడానికి దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ గారు, ఆనంద్, రాంబాబు నాయుడు, కురుకూరి మణికంఠ, తదితర జనసైనికులు, రామచంద్రపురం నియోజకవర్గంలో గల నాలుగు మండలాల అధ్యక్షులు యాండ్ర బుల్లబ్బులు, అవసరాల వెంకటరమణ, సలాదివీరబాబు, ఆకేటి శ్రీకృష్ణ ప్రమేయంతో అమలాపురం పార్లమెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇళ్ళ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగింది. భారతీయ జనతా పార్టీ నుండి సత్తిబాబు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు గుర్రాల సత్యనారాయణ, బండారు సత్యనారాయణ, దేవు పట్టాభి, కోశెట్టి అర్జున, పోలిశెట్టి శ్రీనివాస్, సత్యనారాయణ, పెద్ద వెంకటసత్యవాడ శ్రీహరి పంతులు, సువర్ణ రాజు, గుర్రాల నాని, అవసరాల నారాయణ మూర్తి, కండవిల్లి సత్యనారాయణ, కండవిల్లి సుందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.