పడమటి కంభంపాడు ఇసుక రీచ్ ను సందర్శించిన జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ ఇంఛార్జ్ నలిశెట్టి శ్రీధర్

పడమటి కంభంపాడు

       ఆత్మకూరు, (జనస్వరం) :  ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ  ఇంఛార్జ్  నలిశెట్టి శ్రీధర్ గారు స్థానిక జనసైనికులతో కలిసి పడమటి కంభంపాడు ఇసుక రీచ్ ను సందర్శించడం జరిగింది.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వాల్టా నిబంధనలకు వ్యతిరేకంగా నదీగర్భంలో పదుల సంఖ్యలో భారీ జె. సి. బి. యంత్రాలు పెట్టి సుమారు పదిహేను అడుగుల లోతు మేర ఇసుక తవ్వకాలు జరుగుతున్నా, ప్రభుత్వ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం ఎంతో ఆశ్చర్యానికి గురి చేసింది అని a. గతంలో జనసేన పార్టీ ఈ విషయమై ఆందోళనకు దిగిన విషయం అందరికీ తెలిసినదే. ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా జనసేన పార్టీ అక్కడి నిర్వాహకులను అనుమతి పత్రాలు చూపించమని అడగడం జరిగింది. వారు మా దగ్గర ఎటువంటి అనుమతి పత్రాలు లేవని, మీరు ఎవరికి ఫిర్యాదు  చేసుకున్నా మాకు ఎటువంటి అభ్యంతరం లేదని సమాధానం చెప్పడం, వారి బరితెగింపుతనాన్ని అర్థం పడుతుంది. సోమశిల ప్రధాన జలాశయానికి సుమారు ఒక కిలో మీటరు దూరంలో ఈ విధంగా ఇసుకను తవ్వడం ప్రధాన కట్టడానికి ఎంతో ప్రమాదకరం, అయినప్పటికీ అటు ఇరిగేషన్ అధికారులు గానీ, ఇటు మైనింగ్ అధికారులు గానీ, జిల్లా యంత్రాంగం గానీ, నిమ్మకు నీరెత్తినట్టు చోద్యం చూస్తూనే ఉండటం ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వాల్టా నిబంధనలను అనుసరించి నదీగర్భంలో ఇసుకను యంత్రాలతో త్రవ్వరాదు. అయినప్పటికీ పదుల సంఖ్యలో,  జెసిబి యంత్రాలతో ఇసుకను యధేచ్చగా తవ్వుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం ఎంతో విస్మయానికి గురి చేస్తుంది. చుట్టుపక్కల పది గ్రామాలకు చెందిన, తాగునీటి అవసరాలను తీర్చే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఈ ప్రాంతంలోనే ఉండడం గమనార్హం. ఈ విధంగా యధేచ్చగా ఇసుక అక్రమ తవ్వకాలు జరిపితే, భూగర్భజలాలు అడుగంటి ఈ చుట్టుపక్కల గ్రామాలకు మంచినీటి సౌకర్యం కనుమరుగయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయమై స్థానిక పడమటి కంభంపాడు వాస్తవ్యులు తో కలిసి మేము గతంలో ధర్నా చేయడం జరిగింది. కొన్ని వందల సంఖ్యలో భారీ వాహనాలతో ప్రతి నిత్యము ఇక్కడి నుండి ఇసుక పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. నిబంధనలకు వ్యతిరేకంగా ఇసుక దోపిడీని గురించి మా రాష్ట్ర జనసేన పార్టీ యంత్రాంగానికి తెలియజేయడం జరిగింది. త్వరలో ఈ విషయమై ఒక ప్రత్యేక కార్యాచరణతో ముందుకు పోతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అధికారులు ఈ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోని పక్షంలో, మా రాష్ట్ర జనసేన పార్టీ యంత్రాంగం తో కలిసి జరుగుతున్న ఇసుక దోపిడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ  కార్యక్రమములో  జనసేన నాయకులు, జనసైనికులు తదితురులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way