అరకు, (జనస్వరం) : చొంపి గెడ్డ వంతెన వెంటనే నిర్మించాలి జనసేనపార్టీ అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి మాదాల శ్రీరాములు డిమాండ్ చేశారు. ఈ సందర్భముగా జనసేనపార్టీ నాయకుడు మాదాల శ్రీరాములు మాట్లాడుతూ అరకు వెలి మండలం చొంపి పంచాయితీ అరకు వెలి చొంపి మధ్యలో ఉన్న గెడ్డ వద్ద వంతెన నూతనంగా నిర్మించాలని ఎప్పటి నుంచో MLA లకు, మంత్రులకు, స్థానిక నాయకులకు, అధికారులకు గ్రామస్తులు విన్నవించినా పట్టించుకొనే నాధుడు లేడు. నిన్న రాత్రి కురిసిన గులాబ్ తుపాన్ వల్ల చొంపి గెడ్డ వంతెనపై నుంచి బురద నీరు ఉప్పొంగిపోయి వస్తుంది. స్పందించిన జనసేనపార్టీ నాయకులు గెడ్డ దగ్గర వెళ్లి నిర్లక్ష్యం చేస్తున్న అధికారుల పై వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది. వంతన పై నుండి భారీగా బురద నీరు రావడంతో వాహనాలు రాకపోకలకు ఇబ్బందిగా ఉంది అన్నారు. నాలుగు పంచాయితీలు ప్రజలు రాకపోకలకు భయంగా ఉంది. వంతనే కొట్టుకొని పోయే ప్రమాదం ఉందని వెంటనే ప్రభుత్వం స్పందించి నూతన వంతెన నిర్మిచాలని జనసేనపార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదలు చేసింది. ప్రభుత్వం స్పందించకపోతే మండల కేంద్రంలో ఉద్యమం చేస్తామని తెలియపరుస్తున్నాం. ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ వర్కింగ్ కమిటీ సభ్యులు కొనెడి లక్ష్మణ్ రావు, మండల నాయకులు అర్జున్ రామకృష్ణ మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.