Logo
Date of Publish : 19 July 2023, 9:14 pm
Editor : Sake Naresh

జనసేన పార్టీ మరియువాసవి క్లబ్ ఆధ్వర్యంలో పాఠశాలకు వంట సామాగ్రి అందజేత

        విశాఖపట్నం ( జనస్వరం ) : వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మరియు జనసేన పార్టీ ఆధ్వర్యంలో మండల పరిషత్ పాఠశాలలో వంట సామాగ్రిని అందజేశారు. దక్షిణ నియోజకవర్గం నాయకులు, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ వి 201ఏ గవర్నర్ డాక్టర్ కందుల నాగరాజు ముఖ్యఅతిథిగా హాజరై ఈ వంట సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ వి 201ఏ అఫీషియల్ విజిట్లో భాగంగా క్లబ్బులు అన్నిటికీ పర్యటించడం జరుగుతుందని అందులో భాగంగా వాసవి క్లబ్ వారు చేసే సేవలను పరిశీలించడం జరిగిందన్నారు. సామాజిక బాధ్యతగా వాసవి క్లబ్ నిర్విరామంగా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ ఎంతోమందికి చేయూత అందిస్తుందని చెప్పారు. ఎన్నో పేద కుటుంబాలలో వెలుగును నింపిందన్నారు. వాసవి క్లబ్ మరియు జనసేన పార్టీ చేస్తున్న సేవా కార్యక్రమాలకు ప్రజల నుంచి కూడా అనూహ్య స్పందన వస్తుందన్నారు. ఎటువంటి ప్రతిఫలేక్ష లేకుండా నిస్వార్థంతో వాసవి క్లబ్ మరియు జనసేన పార్టీ పలు సేవా కార్యక్రమాలను కొనసాగిస్తుందని వెల్లడించారు. ఇందులో భాగంగానే పాఠశాలకు వంట సామాగ్రిని అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రీజినల్ చైర్ పర్సన్ చెక్క బంగార్రాజు, రీజినల్ సెక్రటరీ కేసారపు నాగేశ్వరరావు,జోన్ చైర్ పర్సన్ సిల్వర్ స్టార్ వరధాకృష్ణ, కొలుకూరి రామకృష్ణ, గుర్రాల శ్రీను, భాచ్చు అప్పలరాజు, ఎస్ సతీష్ కుమార్, కేసారపు సుబ్బారావు, ఉడా రాజు, కోట్ల రాధ,శైలజ, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com