Logo
Date of Publish : 27 March 2023, 5:10 pm
Editor : Sake Naresh

అగ్నిప్రమాదంలో ఇళ్లు దెబ్బ తిన్న కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించిన జనసేనపార్టీ, తదేకం ఫౌండేషన్

           అమలాపురం ( జనస్వరం ) : బండారు లంకలో నిన్న జరిగిన అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన ఐదు కుటుంబాలను  జనసేనపార్టీ అమలాపురం నియోజకవర్గం ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు  పార్టీ నాయకులతో కలిసి అగ్నికు ఆహుతైన ఇళ్ళను పరిశీలించారు. జనసేనపార్టీ, తదేకం ఫౌండేషన్ వారి సహకారంతో తాత్కాలిక సహాయంగా ఒక్కో కుటుంబానికి 8 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ప్రభుత్వం తక్షణమే ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు నిర్మించాలని అదేవిధంగా వారి జీవనాధారమైన చేనేత మగ్గాలు కూడా అగ్నిలో ఆహుతి అయ్యాయని తక్షణమే వారికి చేనేత మగ్గాలు అందజేయడమే కాకుండా వారికి నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ప్రభుత్వం 15 రోజుల్లో వారికి పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని అలాకాని పక్షంలో జనసేన ప్రత్యక్షంగా పూనుకుని బాధితుల ఇళ్ల నిర్మాణానికి ముందుకు వస్తుందని రాజబాబు గారు అన్నారు ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నాయకులు చిక్కాల సతీష్, బట్టు పండు, పిండి రాజా, కుంపట్ల రమేష్, ముత్తబత్తుల శ్రీను, తూము రమేష్, పొనకల ప్రకాష్, అరళ్ళపల్లి దుర్గ, బండి మణికంఠ, తులా సతీష్, తులా కృష్ణ, కొప్పుల వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com