
విజయనగరం ( జనస్వరం ) : శ్రీ శ్రీ శ్రీ నేరేళ్ల మాంబ పండుగ సందర్భంగా శృంగవరపుకోట జనసేన పార్టీ నియోజకవర్గ నాయకుడు పెదిరెడ్ల రాజశేఖర్ ని జననీరాజనంతో ఆహ్వానం పలికి విందు భోజనం ఏర్పాటు చేశారు. పండుగ సందర్భంగా రాయుడి పేట గ్రామ జనసైనికుల ఆధ్వర్యంలో మరియు వీలుపర్తి గ్రామ జనసైనికుల ఆధ్వర్యంలో పెదిరెడ్ల రాజశేఖర్ ఆర్థిక సాయంతో ఈ రెండు గ్రామాలలో డాన్స్ బేబీ డాన్స్ అను కార్యక్రమంను సంప్రదాయ బద్దంగా నిర్వహించారు. ఇదే స్టేజ్ పై జనసేన పార్టీ సిద్ధాంతాలను, పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని ప్రజలకు వివరించి, జనసేనాని పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసే బాధ్యత మీరు తీసుకోవాలని ప్రజలకు తెలియజేసారు. ఈ రెండు గ్రామాల నుంచి 60 మంది యువకులు పెదిరెడ్ల రాజశేఖర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. పెదిరెడ్ల రాజశేఖర్ మాట్లాడుతూ జనసేనపార్టీ సిద్దాంతాలను, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కోరారు. అలాగే జనసేన పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని కోరారు. పెదిరెడ్ల రాజశేఖర్ ను జనసేన పార్టీ లో జాయిన్ అయిన యువకులు దుశ్శాలువతో సన్మానించి జనసేన పార్టీ కి తమవంతు సహాయ సహకారాలు నిరంతరం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.