Logo
Date of Publish : 12 October 2021, 6:36 am
Editor : Sake Naresh

రాష్ట్రంలో ఇకపై దీపాలు వెలిగించుకొని బతకాల్సిందే : జనసేన పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు టీసీ వరుణ్‌

- విద్యుత్ నష్టాలు పాలకుల చేతగానితనమే
- ఆ నిర్వాకానికి జనం శిక్ష అనుభవించాలా?
- ట్రూ ఆప్‌ చార్జీల పేరుతో జనాన్ని చావగొడతారా?

- అనంతపురం జిల్లా అధ్యక్షులు టీసీ వరుణ్‌

         అనంతపురం, (జనస్వరం) : రాష్ట్రంలో ప్రజలు కరెంట్‌ వాడకం మానేసి మళ్ళీ దీపాలు వెలిగించుకొని బతకాల్సిందేనని జనసేన పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు టీసీ వరుణ్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జనసేనపార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు టీసీ వరుణ్‌ మాట్లాడుతూ... జనం గగ్గోలు'పెడుతుంటే విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని ప్రత్యేక విమానాల్లో క్యాసినోలకు వెళ్తారని, ఎప్పుడో వచ్చిన విద్యుత్‌ నష్టాలను పూడ్చుకొనేందుకు జనం నెత్తి మీద రూ.8 వేల కోట్ల భారంవేయాలని ప్రభుత్వం నిర్ణయించుకొని ముక్కుపిండి వసూలు చేయడం కచ్చితంగా నిరంకుశున్నీ చూపిస్తోందన్నారు. విద్యుత్‌ నష్టాలు అనేవి ప్రజల వాడకం వల్ల రావు అని, పాలకుల చేతగానితనం, మితిరిమీరిన అవినీతివల్ల వస్తున్నాయని, అందరికీ తెలుసు అని అలాగే వాళ్ళ తప్పుడు పనులు, నిర్వాకాలకు ప్రజలు ఎందుకు శిక్ష అనుభవించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ ద్వారా యూనిట్‌ విద్యుత్‌ రూ.2.70పై.కు ఇస్తుంటే వైసీపీ ప్రభుత్వం మాత్రం యూనిట్‌ రూ.5.50పై నుంచి రూ.8 వరకూ వెచ్చించిందని, ప్రైవేట్‌ ప్లాంట్స్‌ నుంచి కొనడం వెనక ఉన్న గూడుపుఠాణీ ఏమిటి? అని ఓ వైపు అవినీతి చేస్తూ మరో వైపు జనాన్ని చార్జీల పేరుతో చావగొట్టడమే వైసీపీ సిద్ధాంతంలా ఉందన్నారు. మితిమీరిన అవినీతికి పాల్పడుతూ టూ అప్‌ ఛార్జీలు లాంటివి వేసి జనంపై భారం వేస్తున్నారని మండిపడ్డారు. ఇక రాబోయే రోజుల్లో జనం కరెంట్‌ వాడకం మానేసి మళ్ళీ దీపాలు వెలిగించుకొని బతకాల్సిందేనని, అసలు కరెంట్‌ వాడకం మానేసి ట్రూ అప్‌ ఛార్జీలు వేసి ప్రజల జేబులు కొల్లగొట్టేయడానికి ప్రభుత్వం సిద్దపడిందన్నారు. ఈ రెండేళ్ళల్లో జగన్‌ మోహన్‌ రెడ్డి సాధించి ఘనత ఏమిటయ్యా అంటే... జనాన్ని మళ్ళీ రాతి యుగం వైపు నడిపించడమే, నీరోగా పేరుపొందిన రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇప్పటి వరకూ ట్రూ అప్‌ చార్జీలపై వివరణ ఇవ్వలేదన్నారు. పాలకుల పాపాలకు జనం ఎందుకు శిక్ష అనుభవించాలని అనేదానికి సమాధానం చెప్పాలన్నారు. జనం విద్యుత్‌ చార్జీలతో బెంబేలెత్తిపోతుంటే బాలినేనిమాత్రం ప్రత్యేక విమానాలు వేసుకొని విదేశాలకు వెళ్ళి క్యాసినోల్లో గడుపుతున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజా క్షేమంపై ఏ మాత్రం బాధ్యత లేదని అర్ధం అవుతోందన్నారు. పాలన చేయమని అవకాశం ఇస్తే అవినీతి చేస్తూ మట్టి, ఇసుక, గనులు, మద్యం అన్నింటా దోపిడీ సాగిస్తున్నారన్నారు. ఇది చాలదు అన్నట్లుగా జనం నెత్తిన విద్యుత్‌ ఛార్జీలు భారం వేస్తున్నారని, అంతకు ముందు ఆస్తి పన్ను, చెత్త పన్నువేశారు. విద్యుత్‌ లేకపోతే పరిశ్రమలు ఎలా వస్తాయి? పరిశ్రమలు లేకుండా యువతకు ఉపాధి ఉద్యోగాలు ఎలా లభిస్తాయి? ఈ నిరంకుశ పాలన పై పోరాటం చేస్తామని జిల్లా అధ్యక్షులు టీసీ వరుణ్‌ ప్రభుత్వానికి డిమాండ్‌ చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com